కాజ‌ల్ స్ట్రాంగ్‌గా తిరిగొచ్చింది!

క‌మ్ బ్యాక్ అంటే డెఫ్షినిష‌య‌ల్ తెలిసిపోయింది కాజ‌ల్ కి. త‌న పని అయిపోయింద‌నుకున్న ప్ర‌తీసారీ స్ట్రాంగ్‌గా తిరిగొస్తోంది ఈ కాటుక క‌ళ్ల చిన్న‌ది. ఇది వ‌ర‌కు కూడా కాజ‌ల్ కెరీర్ ఖ‌తం అనుకున్న ద‌రలో విజృంభించి, వ‌రుస‌గా సినిమాలు చేసేసింది. ఇప్పుడూ అంతే. కాజ‌ల్ ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు అనుకుంటున్న త‌రుణంలో మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాల‌పై సంత‌కాలు పెట్టేస్తోంది.

కాజ‌ల్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. అవి కూడా పెద్ద సినిమాలు. చిరంజీవి 152వ చిత్రంలో ఛాన్స్ అందుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కాజ‌ల్ కావాలి? అనుష్క ని తీసుకోవాలా? అనే సందిగ్థంలో కాజ‌ల్ కే ఓటేసింది చిత్ర‌బృందం. భార‌తీయుడు 2లో కాజ‌ల్ న‌టిస్తోంది. ఇది మామూలు హీరోయిన్ పాత్ర కాదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంద‌ట‌. ఈ సినిమా అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల అవుతుంది. ఇక బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తోంది. జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంది. ఒకేసారి… మూడు భాష‌ల‌కు చెందిన మూడు సినిమాల్ని త‌న ఖాతాలో వేసుకోగ‌లిగింది కాజ‌ల్‌. ఇంత‌కంటే గొప్ప కమ్ బ్యాక్ ఏముంటుంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close