సీసీసీనీ రాజ‌కీయం చేసేస్తే ఎలా?

క‌రోనాకి ఎదురొడ్డుతోంది ప్ర‌పంచం. ఇల్లు దాటి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. కాస్తో కూస్తో సంపాదించుకున్న‌వాళ్లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాలు ఫ‌ర్వాలేదు. ఏ రోజుకారోజు అంటూ క‌డుపు నింపుకునే వాళ్ల ప‌రిస్థితే దుర్భ‌రంగా త‌యార‌వుతోంది. వీళ్ల కాలే క‌డుపుల ఆక‌లి చాల్లార‌చ్చ‌డం అంద‌రి బాధ్య‌త‌. అందుకు ఎవ‌రికి తోచిన దారిని వాళ్లు ఎంచుకుంటున్నారు. చిత్ర‌సీమ కూడా ఓ స‌రికొత్త ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. సీసీసీ అంటూ ఓ సంస్థ‌ని స్థాపించి, విరాళాలు సేక‌రించి, నిరు పేద కార్మికుల క‌డుపు నింపేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే సీసీసీకి భారీ మొత్తంలో విరాళాలు వ‌స్తున్నాయి. వాటితో ఎలాంటి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి? అనే విష‌యంపై సినిమా పెద్ద‌లు, సీసీసీ కార్య‌వ‌ర్గం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది.

అయితే ఈ సీసీసీ వెనుక రాజ‌కీయ కోణాన్ని వెలికి తీసే ప‌నిలో కొంత‌మంది పెద్ద‌లు త‌ల‌మున‌క‌లు అవ్వ‌డం ఆశ్చ‌ర్యాన్ని, ఆందోళ‌న‌నీ క‌లిగిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌ని, ఆ ప్ర‌భుత్వానికి ఆర్థిక స‌హాయం అందించ‌డం ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లే చిత్ర‌సీమ సీసీసీ పేరుతో విరాళాల్ని అటు వైపుకు మ‌ళ్లిస్తోంద‌ని కోడి గుడ్డుపై ఈక‌లు పీకే కార్య‌క్ర‌మంలోకి దిగింది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే గ‌నుక ఈపాటికే ఇబ్బుడి ముబ్బుడిగా విరాళాలు ప్ర‌క‌టించేవార‌ని లాజిక్కులు తీస్తోంది. నిజానికి ఇప్ప‌టికే స్టార్లు త‌మ విరాళాల్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ప్ర‌క‌టించేశారు. వాటికి ప్ర‌క‌టించిన త‌ర‌వాతే.. ఇప్పుడు సీసీసీకి కూడా కొంత మొత్తం అందించ‌డానికి ముందుకొచ్చారు. జ‌గ‌న్ అంటే ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లే.. విరాళాల్ని సీసీసీకి మ‌ళ్లించారు అనుకొంటే, అలాంటి వాళ్ల‌కు కేసీఆర్ అన్నా కూడా ఇష్టం లేన‌ట్టే క‌దా? సీసీసీకి విరాళాలు ఇవ్వ‌డం కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త అని కూడా అనుకోవాలా? నిజానికి ఇది అర్థం లేని వాద‌న‌.

చిత్ర‌సీమ‌లో కార్మికుల గురించి ఏ ప్ర‌భుత్వమూ ప‌ట్టించుకొన్న పాపానికి పోలేదు. వాళ్లు ఆంధ్రాకి చెందిన వాళ్లా? తెలంగాణ‌లో భాగ‌స్వాములా? అనేది ఎప్ప‌టికీ తేల‌ని ప్ర‌శ్న‌. వాళ్ల‌ని ఓటు బ్యాంకుగా కూడా ఎవ్వ‌రూ ప‌రిగ‌ణించ‌డం లేదు. ఓ విధంగా ఏ ప్ర‌భుత్వానికీ కానివాళ్లుగా మారిపోయారు. అలాంటి వాళ్ల‌ని క‌నీసం సినిమా ప‌రిశ్ర‌మ కూడా ప‌ట్టించుకోక‌పోతే ఎలా? అందుకే సీసీసీ ఆవిర్భవించింది. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురుచూడ‌కుండా త‌మ బాబోగుల గురించి తామే ఆలోచించుకుంటున్నారు. ఏ ప్ర‌భుత్వానికీ ప‌ట్ట‌ని సినీ కార్మికుల క‌డుపుల్ని వాళ్లే నింపుకుంటున్నారు. ఓ ర‌కంగా ప్ర‌భుత్వానికి ప‌ని త‌ప్పించినవాళ్ల‌య్యారు, ఇది ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం. అభినందించాల్సిందిపోయి.. దాన్నీ రాజ‌కీయం చేయ‌డం ఏమిటో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close