అన్ని వైపులా ‘బాహుబలి’ హిస్టీరియా: ధియేటర్‌వద్ద మేకపోతు బలి

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన బాహుబలి చిత్రం, టాక్ విషయం పక్కన పెడితే సంచలనస్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకుంటోంది. ఎక్కడచూసినా ధియేటర్లవద్ద విపరీతంగా కిక్కిరిసిన క్యూలైన్లు, తొక్కిసలాటలు కనబడుతున్నాయి. గుంపును నియంత్రించటానికి అనేకచోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పలుచోట్ల లాఠీ ఛార్జిలుకూడా చేశారు. టికెట్లు దొరకనివారు ధియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ వ్యాపారం చేయిస్తున్నాయని ఆగ్రహంతో రాళ్ళువేయటంవంటి ఘటనలుకూడా చోటుచేసుకున్నాయి. మరోవైపు ప్రభాస్ అభిమానులగురించి చెప్పనలవికాకుండా ఉంది. మూడేళ్ళతర్వాత తమ హీరో చిత్రం విడుదలవుతుండటంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ధియేటర్లవద్ద వారు విపరీతమైన సందడి చేస్తున్నారు. అయితే రంగారెడ్డిజిల్లా వికారాబద్‌లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అభిమానులు తమ హీరో కటౌట్లకు పాలాభిషేకం చేయటం, గుమ్మడికాయలతో దిష్టితీయటం సాధారణమైనప్పటికీ, వికారాబాద్ అభిమానులు విలక్షణంగా మొదటి షో ముందు  మేకపోతును బలి ఇచ్చి దాని రక్తంతో ప్రభాస్ పోస్టర్‌కు తిలకం దిద్దారు. సినీమాక్స్ ధియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఫోటో ఇప్పుడు వాట్సప్‌లో రౌండ్లు కొడుతోంది. దీనిగురించి ఆ ధియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, తాము రిలీజ్ హడావుడిలో ఉండి గమనించలేదని, ఎవరో చెప్పటంతో బయటకెళ్ళి చూసేసరికి వారు ఆ మేకపోతును ఆటోలో వేసుకుని పరారయ్యారని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close