లాక్‌డౌన్.. నిరంతర ప్రక్రియ..!

కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన దాని ప్రకారం.. మే మూడో తేదీతో లాక్ డౌన్ ముగిసిపోవాలి. కానీ ఆలాంటి సూచనలేం లేవనీ… కొన్ని కొన్ని మినహాయింపులతో లాక్ డౌన్ కొనసాగుతుందని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్యమంత్రలు పరోక్షంగా తేల్చేశారు. మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రుల్లో మెజార్టీ లాక్‌డౌన్ తొలగించాలని సూచించారు. అయితే.. ప్రధానమంత్రి మాత్రం వైరస్ ప్రభావం లేని చోట్ల.. లాక్ డౌన్ మినహాయింపులపై ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ.. హాట్‌స్పాట్‌ ప్రాంతాలు, కొత్తగా బయట పడుతున్న ప్రాంతాల్లో మాత్రం కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాల్సి ఉందని స్పష్టంచేశారు. పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎంలకు ప్రధాని తెలిపారు. జోన్ల వారీగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

గతంలోనే కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని అనుకుంటోందని ప్రచారం జరిగింది. అయితే మరో పందోమ్మిది రోజులు పొడిగించారు. ఆ 19 రోజులు పూర్తయిన తర్వాత జోన్ల వారీగా సడలింపులు ఇవ్వాలనుకుంటున్నారు. హాట్ స్పాట్లను పూర్తిగా నియంత్రిస్తే.. వైరస్ కంట్రోల్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాల్సిఉందని.. అదే సమయంలో వైరస్ వృద్ధి చెందకుండా చూడాలని … ఈ రెండింటిని సమన్వయం చేసుకోవాలంటే.. వైరస్ ఉన్న ప్రాంతాన్ని మాత్రం దిగ్బంధించేసి..మిగతా ప్రాంతాల్లో.. సాధారణ రోజువారీ వ్యవహారాలకు అనుమతి ఇవ్వడం మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జోన్లను జిల్లాల వారీగా తీసుకుంటారా.. మండలాల వారీగానా అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కేంద్రం విడుదల చేస్తున్న మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాలి.. అంత కంటే కఠినంగా అమలు చేయవచ్చు కానీ.. తాము చెప్పిన దాని కన్నా ఎక్కువ రిలాక్సేషన్స్ ఇవ్వొద్దని కేంద్రం అంటోంది. లాక్ డౌన్ అనేది ఒకే సారి ఎత్తి వేయరని ప్రధాని మాటలతోనే తేలిపోతోందంటున్నారు. వైరస్ అంతమయ్యే వరకూ.. ఈ లాక్ డౌన్ ప్రక్రియ ఉంటుందని.. మెల్లగా ఓ క్లారిటీ వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close