కామ్రేడ్ భార‌త‌క్క‌… ఆగ‌మ‌నం

నీదీ నాదీ ఒకే క‌థ‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌. ఆ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. క‌మ‌ర్షియ‌ల్ గానూ ఓకే. అందుకే… `విరాట‌ప‌ర్వం` ఛాన్సొచ్చింది. న‌క్స‌ల్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ప్రియ‌మ‌ణి ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంది. ఈ రోజు ప్రియ‌మ‌ణి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలోని ఆమె లుక్‌ని బ‌య‌ట‌కు వ‌దిలింది చిత్రబృందం. కామ్రేడ్ భార‌త‌క్క పాత్ర‌లో ప్రియ‌మ‌ణి క‌నిపించ‌బోతోంది. న‌క్స‌లైట్ గా ప్రియ‌మ‌ణి లుక్ ఇంప్రెస్‌చేసేలానే క‌నిపిస్తోంది. ఈ పాత్ర కోసం ట‌బుని అనుకున్నారు. ఆమె కాల్షీట్లు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రియ‌మ‌ణిని ఎంచుకున్నారు. జాతీయ ఉత్త‌మ‌న‌టిగా ఘ‌న‌త సాధించిన ప్రియ‌మ‌ణి ఖాతాలో మ‌రో మంచి పాత్ర ప‌డిన‌ట్టే. రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌. న‌క్స‌ల్ నేప‌థ్యంలో సాగినా, ప్రేమ‌క‌థ‌కీ స్థానం ఉంద‌ని, వాటికి సంబంధించిన స‌న్నివేశాలు హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close