ప‌వ‌న్‌కి స‌ర్ది చెబుతున్న క్రిష్‌?

వ‌కీల్ సాబ్ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్టాలెక్కించాల్సిన సినిమా క్రిష్ దే. కానీ ప‌వ‌న్ ఆలోచ‌న మారింది. క్రిష్ సినిమా కాస్త వెన‌క్కి జ‌రిపి, ఆ స్థానంలో హ‌రీష్ శంక‌ర్ సినిమా ఓకే చేయాల‌ని చూస్తున్నాడు. ఈ విష‌య‌మై.. ప‌వ‌న్ – హ‌రీష్ ల మ‌ధ్య భేటీ జ‌రిగింద‌ని, `స్క్రిప్టు రెడీ చేసుకో.. ఎప్పుడైనా స‌రే, ప‌ట్టాలెక్కించ‌డానికి సిద్ధంగా ఉండు` అంటూ ప‌వ‌న్ హింట్ ఇచ్చాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

క్రిష్ సినిమా వెన‌క్కి నెట్ట‌డానికి చాలా కార‌ణాలున్నాయి. క్రిష్‌ది పాన్ ఇండియా సినిమా. కాస్త లేట్ అవుతుంది. భారీ సెట్లు, క్రౌడ్, హంగామా ఉంటుంది. క‌రోనా భ‌యాల మ‌ధ్య‌… ఇంత భారీ తారాగ‌ణం మ‌ధ్య షూటింగ్ చేయ‌డం క‌ష్ట‌మే. అందుకే ప‌వ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. అందుకే క్రిష్ ఇప్పుడు మ‌రో ప్లాన్ వేశాడు. త‌క్కువ టీమ్‌తో షూటింగ్ చేయ‌గ‌ల స‌న్నివేశాల‌న్ని ఓ షెడ్యూల్‌లో చేయ‌డానికి క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ప‌వ‌న్‌తో పాటు ఒక‌రిద్ద‌రు ఉండే సీన్లు ముందుగా తీస్తాన‌ని, భారీ తారాగ‌ణం అవ‌స‌ర‌మైన స‌న్నివేశాల‌న్నీ చివర్లో తీసుకుందామ‌ని ప‌వ‌న్‌కి స‌ర్ది చెబుతున్నాడ‌ట‌. ఇలాగైతే.. వ‌కీల్ సాబ్ త‌ర‌వాత క్రిష్ సినిమా మొద‌ల‌వుతుంది. అయితే దానికి ప‌వ‌న్ అంగీకారం తెల‌పాల్సివుంటుంది. క్రిష్ సినిమా కొంత మేర షూటింగ్ జ‌రిగింది. సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌డంలో క్రిష్ నేర్ప‌ది. ఇవ‌న్నీ క్రిష్ సినిమాకి ప్ల‌స్ పాయింట్లు. కానీ.. ఏ సినిమా ముందుగా మొద‌ల‌వ్వాల‌న్న‌ది ప‌వ‌న్ చేతుల్లో ఉందిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close