సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న వారికే ఎక్కువ అతిధి మర్యాదలు లభిస్తాయని..గదులు..దర్శనం కూడా డబ్బులున్న వారికే దక్కుతుందని.. అలాంటి ఆలయానికి వెళ్లాల్సిన అవసరం ఉందా.. అని శివకుమార్ ప్రసంగించినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రసంగంపై తమిలనాడులో ఓ వ్యక్తి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 29న శివకుమార్‌పై కేసు నమోదైంది. ఆ ఫిర్యాదును ఈ మెయిల్‌ ద్వారా టీటీడీ విజిలెన్స్‌కు అందింది.

దీనిపై..తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో టీటీడీ ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్య తండ్రి శివకుమార్‌పై మాత్రమే కాదు.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టారంటూ..మరికొంత మందిపైనా టీటీడీ కేసులు పెట్టింది. తమిళనాడులో నమోదైన కేసును..టీటీడీ సీరియస్‌గా తీసుకోవడమే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు భక్తులు తిరుమలకు ఎంత ఎక్కువ మంది వస్తారో…అంత కంటే ఎక్కువగా…అక్కడ నాస్తిక వాద భావజాలం ఉన్న వారు ఉంటారు. అక్కడి ద్రవిడ పార్టీల మౌలిక సిద్ధాంతం.. దేవుడు లేడవే. ఆ భావజాలంతో ఎన్నో కామెంట్లు చేస్తూంటారు. అయితే.. సూర్య మాత్రం శ్రీవారి భక్తుడు. ఆయన తరచూ కుటుంబంతో శ్రీవారి దర్శనానికి వస్తూంటారు.

శివకుమార్ కూడా.. ఆలయంలో దర్శనాలు… ధనికులకు ఇచ్చే మర్యాదల గురించే మాట్లాడారు కానీ..దేవుడి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినా టీటీడీ కేసు పెట్టింది. విశేషం ఏమిటంటే.. ఏపీ సీఎం జగన్ కు సూర్య క్లాస్‌మెంట్…బెస్ట్ ఫ్రెండ్ కూడా. శివకుమార్ పై తొందరపాటుగా టీటీడీ ఫిర్యాదు చేసి ఉంటుందని ఆ కేసు విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు ఉండవని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close