త‌మ‌న్నాకి ఎంతిస్తున్నారో తెలుసా?

ఓటీటీ వేదిక‌ ‘ఆహా’ని గ‌ట్టిగా నిల‌బెట్టేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు అల్లు అర‌వింద్‌. ఇప్ప‌టికే ఈ సంస్థ‌పై దాదాపుగా 80 కోట్ల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. రిజ‌ల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఈ సంస్థ కుదురుకుని, లాభాలు తెచ్చి పెట్ట‌డానికి క‌నీసం రెండేళ్లు ప‌డుతుంది. దీనికి ఫిక్స‌య్యే… రంగంలోకి దిగారంతా. `ఆహా`కి అద‌న‌పు హంగులు తెచ్చేందుకు కోర్ టీమ్ విశ్వయ‌త్నం చేస్తోంది. అందులో భాగంగా త‌మ‌న్నాని రంగంలోకి దింపుతోంది. త‌మ‌న్నాతో ఓ టాక్ షో చేయ‌బోతోంది ఆహా. ఈ టాక్ షోలో సినిమా సెల‌బ్రెటీలు పాలు పంచుకుంటారు. నెంబ‌ర్ వ‌న్ యారీ, ల‌క్ష్మీస్ టాక్ షో.. టైపు అన్న‌మాట‌. త‌మ‌న్నా లాంటి స్టార్ ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం, సెల‌బ్రెటీల‌కు ఛాలెంజ్‌లు విస‌ర‌డం ఆక‌ట్టుకునే అంశ‌మే. పైగా అల్లు అర‌వింద్ పిలిస్తే.. స్టార్ల‌కు వ‌రుస క‌ట్టేస్తారు. సో.. షో కూడా పాపుల‌ర్ అయిపోతుంది. త‌ద్వారా ఆహాకు మంచి మైలేజీ దక్కుతుంది. ఇందుకు గానూ… త‌మ‌న్నాకు భారీ మొత్తంలో పారితోషికం క‌ట్ట‌బెతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. ఓ ఇంట‌ర్వ్యూకి త‌మ‌న్నాకు 8 నుంచి 10 లక్ష‌ల వ‌ర‌కూ ముట్ట‌జెప్ప‌బోతున్నార్ట‌. వారానికి ఒక ఇంట‌ర్వ్యూ స‌రిపోతుంది. త‌మ‌న్నా కాల్షీట్లు వారం రోజులు దొరికితే చాలు. ఏడెనిమిది ఇంట‌ర్వ్యూలు ప్లాన్ చేసి, వాటిని రెడీ చేసుకోవాల‌న్న‌ది `ఆహా` ఆలోచ‌న‌. ఈ ఇంట‌ర్వ్యూల‌ను ఆహాలోనే కాదు, ఓ టీవీ ఛాన‌ల్‌లోనూ ప్ర‌ద‌ర్శిస్తార్ట‌. ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్‌లో శ్లాట్ ని కొనుగోలు చేయాల‌ని, త‌ద్వారా ఆహాకి మ‌రింత మైలేజీ క‌ల్పించాల‌ని భావిస్తోంది. కేవ‌లం ఈ షో ద్వారా త‌మ‌న్నాకు 2 నుంచి 3 కోట్ల వ‌ర‌కూ ముట్ట‌జెప్పే ఛాన్సుంది. లాక్ డౌన్ టైమ్‌లో.. ఇది భ‌లే సంపాద‌న క‌దా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close