“మనీ స్కాం”లో జీవీకే కూడా తగ్గలేదుగా..!?

దేశంలో ఇంత వరకూ బడా బడా ఫైనాన్షియల్ స్కాంలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎందరో.. ఈ స్కాముల్లో ఉన్నారు. అయితే.. బడా పారిశ్రామికవేత్తగా ఉన్నా.. “జీవీకే” పేరు మాత్రం.. ఈ స్కాంలలోకి పెద్దగా రాలేదు. ఇప్పుడు.. ఒకే సారి.. దాదాపుగా రూ. వెయ్యి కోట్ల స్కాం చేశారంటూ..జీవీకే గ్రూప్ చైర్మన్ అయిన జీవీ కృష్ణారెడ్డితో పాటు.. ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిపై కూడా.. సీబీఐ కేసు నమోదు చేసింది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత నెలన్నర రోజులుగా.. జీవీకే గ్రూపు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అన్నింటినీ నిర్ధారించుకున్న తర్వాతే.. సీబీఐ కేసు నమోదు చేసింది. నేడో రేపో.. జీవీ కృష్ణారెడ్డితో పాటు సంజయ్ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

జీవీకే గ్రూప్.. ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో కూడా ఉంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో జీవీకేకి 50 శాతానికిపైగా వాటా ఉంది. నిర్వహణ మొత్తం జీవీకే చేతుల్లోనే ఉంది. ఈ అధికారాన్ని ఆసరాగా చేసుకుని.. 2012-2018 మధ్య కాలంలో అక్రమంగా రూ. 705 కోట్లకు పైగా ఇతర సంస్థలకు మళ్లించారు. తప్పుడు బిల్లులు.. పెట్టారు. తమ కంపెనీల పేరుతో తప్పుడు కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి నిధులు మళ్లించారు. తొమ్మిది ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపి బోగస్ వర్క్ కాంట్రాక్టులు చూపించి రూ. 310 కోట్లు నొక్కేశారు.

అలాగే విమానాశ్రయానికి చెందిన రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను కూడా మళ్లించారు. అదే సమయంలో.. విమానాశ్రయ ఆదాయాన్ని కూడా తక్కువ చేసి చూపించారు. ఇలా మొత్తంగా.. జీవీకే గ్రూప్ రూ. వెయ్యి కోట్లను.. అక్రమంగా నొక్కేసిందని సీబీఐ తేల్చింది. ఈ కేసుకు సంబంధించి జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీవీ కృష్ణారెడ్డి.. మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి వియ్యంకుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close