క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది. ఇప్ప‌టికే కొన్ని క‌థ‌లు లాక్ అయ్యాయి. అయితే యూవీకి మ‌రి కొన్ని క‌థ‌లు కావ‌ల్సివ‌చ్చాయి. అందుకే క‌థ‌ల వేట‌లో ప‌డింది. వ‌ర్థ‌మాన ర‌చ‌యిత‌ల్ని పిలిపించి.. మ‌రీ క‌థ‌లు వింటోంద‌ట‌. సుజిత్ ఇప్ప‌టికే కొంత‌మంది యువ ర‌చ‌యిత‌ల్ని యూవీకి పంపాడు. రాధాకృష్ణ (రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు) కూడా త‌న వంతుగా కొన్నిక‌థ‌లు వినిపించాడ‌ట‌. క‌నీసం మ‌రో అర‌డ‌జ‌ను చిన్న క‌థ‌ల్ని యూవీ రెడీగా ఉంచాల‌ని భావిస్తోంది. లాక్ డౌన్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో పెద్ద స్టార్ల‌తో సినిమాలు తీయ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. పైగా హీరోలంతా త‌మ‌త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఇలాంట‌ప్పుడు చిన్న సినిమాలే న‌యం అన్న‌ది యూవీ ఉద్దేశం. రాధ్యే శ్యామ్ త‌ర‌వాత‌… కొన్నాళ్లు పెద్ద సినిమాల జోలికి వెళ్ల‌క‌పోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close