ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌వుతున్న బాల‌య్య `న‌ర్త‌న శాల‌`

`న‌ర్త‌న శాల‌` పేరుతో నంద‌మూరి బాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా మొద‌లై ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ద్రౌప‌తిగా సౌంద‌ర్య న‌టించిన చిత్ర‌మిది. కొంత మేర షూటింగ్ జ‌రుపుకున్నాక‌, కొన్ని అవాంత‌రాలు ఎదుర‌య్యాయి. సౌంద‌ర్య ఆకాల మ‌ర‌ణం కూడా ఈ సినిమా ఆగిపోవ‌డానికి ఓ కార‌ణ‌మైంది. ఇంత‌కాలానికి ఈ సినిమా విడుద‌ల అవుతోంది. సినిమా మొత్తం కాదు. అందులోని 17 నిమిషాలు. షూటింగ్ జ‌రుపుకున్న కొంత భాగాన్ని ఎడిట్ చేసి, రీ రికార్డింగ్ జ‌రిపి, డ‌బ్బింగులు చెప్పి ఈ 17 నిమిషాల ఎపిసోడ్ ని `శ్రేయాస్‌` ఓటీటీ ద్వారా విడుద‌ల చేస్తున్నారు. నిజానికి బాల‌య్య పుట్టిన రోజునే ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ.. ఇప్ప‌టికి ఆ ప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 24న శ్రేయాస్ లో `న‌ర్త‌న శాల‌` చూడొచ్చు. అయితే.. దానికి టికెట్ కొనుగోలు చేయాల్సివుంటుంది. దీని ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని బాలకృష్ణ సామాజిక సేవ కోసం ఉప‌యోగించ‌బోతున్నారు. అప్ప‌టి న‌ర్త‌న శాల ఎలా వుంది? బాల‌య్య ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభేంటి? అనేది తెలియాలంటే `న‌ర్త‌న‌శాల‌` చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close