బోయ‌పాటి.. ఇంత లేటేంటి?

ఓవైపు క‌రోనా, మ‌రో వైపు వ‌ర్షాలు. షూటింగుల‌కు ఆటంకంగా మారాయి. స్టార్ హీరోలు సినిమా షూటింగుల‌కు సిద్ధంగా లేరు. చిరంజీవి, వెంక‌టేష్‌, సినిమాల షూటింగులు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. అన్నీ సిద్ధంగా ఉన్నా… హీరోలు మాత్రం స‌న్న‌ద్ధంగా లేక‌పోవ‌డంతో ఈ స‌మ‌స్య‌.

బాల‌కృష్ణ సినిమా ప‌రిస్థితి వేరు. ఆయ‌న సిద్ధంగానే ఉన్నా, బోయ‌పాటి మాత్రం `రెడీ` కాలేదు. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ కోసం నంద‌మూరి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ… షూటింగు ఎప్పుడు మొద‌ల‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. దానికి కార‌ణం.. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక లో ఇంకా స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డ‌మే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖ‌రారు కాలేదు. ఈమ‌ధ్య ఓ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చినా, ఆమెను ఎంపిక చేసుకోవాలా? వ‌ద్దా? అనే విష‌యంలో బోయ‌పాటి ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని తెలుస్తోంది. గ‌త నెల రోజులుగా బోయ‌పాటి ఆఫీసులో ఈ సినిమా హీరోయిన్ కోసం ఆడిష‌న్స్ చేస్తూనే ఉన్నార్ట‌. అయినా… ఇంకా ఖ‌రారు చేయ‌లేక‌పోయారు. ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రు? అనే విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేదు. కెమెరామెన్‌, ఫైట్ మాస్ట‌ర్లు, సంగీత ద‌ర్శ‌కుడు.. త‌ప్ప మ‌రెవ్వ‌రి పేర్లూ ఖ‌రారు కాలేద‌ని, అవ‌న్నీ ఫైన‌ల్ అయి, వాళ్ల కాల్షీట్లు దొరికితే త‌ప్ప – షెడ్యూల్ సెట్ చేయ‌డం కుద‌ర‌ద‌ని తెలుస్తోంది. ద‌స‌రా పండ‌గ త‌ర‌వాత షూటింగ్ ప్రారంభించాల‌ని బాల‌య్య భావిస్తున్నార‌ని, అప్ప‌టికి ఈ వ్య‌వ‌హారాలు ఓ కొలిక్కి వ‌స్తాయ‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close