రెండే ఆప్షన్స్ : పోలవరంపై పోరాటమా..? రాజీ పడటమా..?

విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో ఇచ్చిన ఒకే ఒక్క రియలిస్టిక్ హామీ పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. ప్రతీ పైసా భరిస్తామని చట్టంలో పెట్టారు. కానీ ప్రత్యేకహోదాను ఎలా చేశారో.. ఇప్పుడు పోలవరాన్ని కూడా అలాగే చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 20వేల కోట్లే అంటూ.. కొత్తగా వెనక్కి వెళ్లిపోయి.. అంచనాలు మార్చేసుకుని ఏపీ నోట్లో మట్టి కొడుతున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరానికి ఉరితాడు వేస్తున్నారు. దేశానికే అన్నం పెట్టే ప్రాజెక్ట్ అవుతుందని… బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని కబుర్లు చెప్పిన కేంద్రం ఇప్పుడు.. ఆ ప్రాజెక్ట్‌ను మూలన పడేసేలా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏపీ సర్కార్ ముందు.. పోరాటం మాత్రమే మిగిలి ఉంది. లేదని రాజీ పడితే.. పోలవరం ఇక కలగానే మిగిలిపోతుంది.

పోలవరం నిర్వాసితుల సలహా, పునరాాస కార్యక్రమాలకే రూ. 33వేల కోట్లు కావాలి. ఈ ఖర్చులో ఓ రూపాయి పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించింది. అందుకే.. టీడీపీ హయాంలో రూ. 55వేల కోట్ల అంచనాలకు టెక్నికల్ ఆమోదం లభించింది. ఇప్పుడు మొత్తం అడ్డం తిరిగేసి.. ప్రాజెక్ట్ మొత్తానికి రూ. 20వేల కోట్లే అంటూ వాదిస్తోంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేంద్రం గల్లా పట్టుకుని అన్నింటినీ ప్రశ్నించేది. టీడీపీ ఎంపీలు.. తెల్లవారక ముందే.. కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు ఉండేవారు. ఎప్పటికప్పుడు.. ఒత్తిడి తెచ్చే వారు. టీడీపీ ఎంపీల ఒత్తిడి భరించలేక.. ఎప్పటికప్పుడు నిధులు కూడా విడుదలయ్యేవి. కానీ ప్రస్తుతం.. గతంలో ఆమోదించిన అంచనాలను కూడా భారీగా తగ్గించి… ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా సతాయిస్తోంది.

రాష్ట్రం అడగడానికి కూడా మొహమాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే.. తాము తగ్గించిన అంచనాలను ఆమోదిస్తేనే పెండింగ్‌లో ఉన్న రూ. రెండు వేల రెండు వందలకోట్లను చెల్లిస్తామంటూ మెలిక పెడుతోంది. ఏపీ సర్కార్ హక్కుగా రావాల్సిన పోలవరాన్ని కూడా అంతే స్థాయిలో అడగానికి సంకోచిస్తోంది. ఫలితంగా పోలవరం ఇప్పుడు ప్రమాదంలో పడింది. కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తే సహకరించదని తేలిపోయింది. ఇప్పుడు ఏపీసర్కార్‌కు పోరాటమే మిగిలింది. పోరాడితే పోలవరం అయినా మిగులుతుంది.. రాజీపడితే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ సందిగ్ధంలో పడుతుంది. కరువును తరిమేసే శక్తి ఉన్న పోలవరం.. కలగా మిగిలిపోతుంది. ఎంత ఆలస్యం అయితే పోలవరం ప్రాజెక్ట్ వ్యయం అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close