బండి సంజయ్ అరెస్ట్ కోరుతున్న టీఆర్ఎస్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎన్నికల ప్రచారం చేయకుండా తక్షణం అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించింది. దీనికి కారణం.. కేసీఆర్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించడం.. మత కల్లోలాలు రెచ్చగొట్టెలా వ్యాఖ్యానించడం. బండి సంజయ్.. దుబ్బాకలో గెలిచినప్పటి నుండి దూకుడు మీద ఉన్నారు. ఆయన ప్రెస్‌మీట్ పెడితే చేస్తున్న విమర్శలు.. ఇస్తున్న హామీలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఇచ్చిన హామీల్లో చలాన్లు కట్టుకుంటామన్నది ఇప్పటికీ ట్రోలింగ్ అవుతోంది. అదే సమయంలో కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఇప్పుడేం చేసినా బీజేపీ ట్రాప్‌లో పడినట్లవుతుందని అనుకుంటున్నారేమో కానీ.. ఇప్పటికైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ బండి సంజయ్ మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. చిల్లరగాళ్లను ఎంపీగా గెలిపిస్తే ఏమవుతుందో చూస్తున్నామని తిట్లు అందుకుంటున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వరద సాయం ఆపాలనే లేఖను సృష్టించారనే అంశాన్ని బండి సంజయ్ చురుగ్గా వాడుకుటున్నారు. ఆ వివాదాన్ని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకెళ్లారు.

సీఎం కేసీఆర్ అక్కడికి రావాలని చాలెంజ్ చేశారు. కేసీఆర్ రారని తెలిసినా.. తాను అక్కడికి వెళ్లి చేయాల్సింది చేశారు. ప్రచార గడువు ముగిసే వరకూ బండి సంజయ్ .. తనదైన దూకుడు చూపించనున్నారు. ఆయన రెచ్చగొట్టే మాటలు … కేసీఆర్ పై విమర్శలు.. ఎలాంటి మలుపులు తిప్పుతాయోనన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు. అందుకే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా ఆయన నోటిని మూయించాలన్న పట్టుదలతో ఉన్నట్లుాగ తెలుస్తోంది. మరి ఎస్ఈసీ టీఆర్ఎస్ ఫిర్యాదుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close