అయిననూ సుప్రీంకోర్టుకు..!?

ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంపై ఏపీ సర్కార్ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్‌ఈసీ ఉల్లంఘించారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే… విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు… ఎన్నికల తేదీలను నిర్ణయించేటప్పుడు.. ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పిందని… ఈ విషయాన్ని ఎస్‌ఈసీ పట్టించుకోలేదని.. ఆయన అంటున్నారు. దీన్నే ప్రధాన అంశం చేసుకుని..ఎస్‌ఈసీ తమను సంప్రదించలేదని చెబుతూ…సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ఎన్నికల షెడ్యూల్‌పై స్టే తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ఏపీ సర్కార్ ఓ రకంగా షాక్‌కు గురయింది. హైకోర్టు చెప్పినట్లుగా సంప్రదింపులు జరుపుతున్నామని.. వాటిని వీలైనంత వరకూ సాగదీయాలని అనుకుంది. అందుకే మొదటగా సీఎస్ నేతృత్వంలో ముగ్గురు అధికారులు వెళ్లి కాస్త మాట్లాడి.. ఓ లేఖ ఇచ్చి వచ్చారు. వచ్చేటప్పుడు.. మరోసారి పదిహేనో తేదీన కలుద్దామని చెప్పి వచ్చారు. అంటే అప్పటి వరకూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోరని అనుకున్నారు. కానీ.. వెంటనే నిమ్మగడ్డ షెడ్యూల్ ప్రకటించడంతో అధికారులకు మైండ్ బ్లాంక్ అయినట్లుంది. ఓ వైపు పై నుంచి వస్తున్న ఒత్తిడి.. మరో వైపు నిమ్మగడ్డ పట్టుదల కలగలిపి మధ్యలో ఉన్న అధికారులను టెన్షన్ పెడుతున్నాయి.

నిజానికి ఎస్‌ఈసీ కూడా.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని చెబుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… పథకాలను ప్రారంభించే ముందు… ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. పథకాలను ప్రారంభిస్తోంది. దీన్ని ఎస్‌ఈసీ ప్రభుత్వానికే రాసిన లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో.. ఎన్నికల షెడ్యూల్ విషయంలో… ఎస్‌ఈసీకే సర్వాధికారాలు ఉంటాయి. ప్రభుత్వ అనుమతితోనే ప్రకటన చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలంటూ… పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటన్నింటినీ కోర్టులు కొట్టి వేశాయి. అయినప్పటికీ.. అన్నీ తెలిసినా ఏపీ సర్కార్ మాత్రం… సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయింది.

ఏపీ సర్కార్ ఆలోచన… ఎన్నికల షెడ్యూల్‌పై ఎలాగైనా స్టే తెచ్చుకుంటే చాలనేనని.. కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సారి న్యాయస్థానం స్టే ఇస్తే.. మళ్లీ విచారణ జరిగి.. ఎన్నికలు నిర్వహించే సమయానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉండరని అంటున్నారు. అప్పుడు.. తమకు అనుకూలమైన వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని అంటున్నారు. మరి సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close