“విశాఖ జోన్” అక్కర్లేదని ఏపీ సర్కార్ అనుకుంటోందా..!?

విశాఖ రైల్వేజోన్‌ కోసం టీడీపీ హయాంలో ఉద్యమాలు జరిగాయి. టీడీపీ కూడా.. కేంద్రాన్ని ప్రశ్నించి.. ప్రశ్నించి బయటకు వచ్చిన తర్వాత …కేంద్రం ఆ జోన్ ప్రకటించింది. అందులోనూ కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. ఏదో జోన్ అయితే ప్రకటించారు. తర్వాత ఏదో ఒకటి విస్తరించుకోవచ్చని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారింది. ప్రకటించిన జోన్‌ విషయంలో ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికి రెండేళ్లవుతోంది. నిజానికి రైల్వేజోన్ ఏర్పాటు కావాలంటే.. నాలుగైదు నెలల సమయం పడుతుంది. కానీ ఆ ఏర్పాటు ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.

రైల్వేజోన్‌కు సంబంధించి ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకూ ఒక్క అడుగు కూడా మందుకు పడలేదు. రైల్వేజోన్ ఏర్పాటుకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం వాటి కోసం.. బడ్జెట్‌లో రూ. మూడు కోట్ల నిధులు కేటాయించారు. కానీ వాటితో పనులు ప్రారంభించలేదు. 0అసలు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉందా లేదా.. అన్నదానిపై అక్కడి ప్రజలకే క్లారిటీ లేకుండా పోయింది. ప్రజల్ని సెంటిమెంట్లతో ఆడుకోవడానికే రాజకీయ నేతలు అవసరం ఉన్నప్పుడల్లా ఈ జోన్ అంశాన్ని తెరపైకి తెస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా.. ఈ విషయంలో… పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

ఏపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ విషయంలో ఆసక్తి చూపకపోవడానికి అసలు జోన్‌ను విజయవాడకు మార్చాలనే ప్లాన్ ఉందంటున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తే.. రైల్వే జోన్ కూడా అక్కడే ఎందుకని… విజయవాడకు మార్చాలన్న డిమాండ్లు కొంత మంది వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోస్తాకు అన్యాయం చేశారన్న భావన రాకుండా… విశాఖను క్యాపిటల్ చేసి.. జోన్ ను విజయవాడకు ఇచ్చామని చెప్పుకోవడానికి పనికొస్తుందన్నట్లుగా వైసీపీ ఈ విషయంలో సైలెంట్ గా మారిదంని.. సరైన సమయంలో… ఆ అస్త్రాన్ని బయటకు తీస్తారని చెబుతున్నారు. మొత్తానికి ప్రజోపయోగ అంశాలన్నింటినీ రాజకీయంతో ముడిపెట్టి.. ఎటూ కాకుండా చేయడంలో రాజకీయ నేతలు చాలా ముందుంటారని… విశాఖ రైల్వేజోన్ అంశమే సాక్ష్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close