నిర్మాత‌గా ర‌వితేజ‌?

హీరోలు నిర్మాణం వైపు అడుగులేయ‌డం కొత్తేం కాదు. దాదాపుగా ప్ర‌తీ అగ్ర హీరోకీ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంది. తాజాగా ఈ జాబితాలో ర‌వితేజ కూడా చేర‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆర్‌.టీ వర్క్స్ పేరుతో ర‌వితేజ ఓ బ్యాన‌ర్‌ని స్థాపించే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఈ పేరుని రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు టాక్‌. అయితే… ఈ సంస్థ‌ని కేవ‌లం కొత్త‌త‌రాన్ని ప్రోత్స‌హించ‌డానికి ఓ వేదిక‌గా చేయబోతున్నాడ‌ట‌. కొత్త ద‌ర్శ‌కుల్ని, న‌టీన‌టుల్ని ఈ బ్యాన‌ర్ ద్వారా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. త‌న సినిమాల్ని త‌న బ్యాన‌ర్‌లో తీసుకునే ప‌ద్ధ‌తికి ర‌వితేజ స్వ‌స్తి చెప్ప‌బోతున్నాడ‌ట‌. ర‌వితేజ‌కు ఎప్ప‌టి నుంచో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న కోరిక‌. అది ఇప్ప‌టి వ‌ర‌కూ నెర‌వేర‌లేదు. అంత‌కంటే ముందుగా నిర్మాత‌గా మార‌బోతున్నాడ‌న్న‌మాట‌. మ‌రి త‌న తొలి సినిమా ఎవ‌రితోనో, ఎప్పుడో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిన్నెల్లి అరెస్టు పేరుతో రోజంతా డ్రామా నడిపిన పోలీసులు !

ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి స్థాయిలో ధ్రిల్లర్ డ్రామాను నడపడంలో అద్భుతమైన విజయం సాధించారు. మొదట పిన్నెల్లి కార్లు పట్టుకున్నారు. తర్వాత ఆయనను చేజింగ్ చేస్తున్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. తర్వాత అరెస్ట్ చేశామని...
video

నెత్తురుతో కత్తికి పదును పెట్టే భార‌తీయుడు

https://www.youtube.com/watch?v=lPP7svLGvFM క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ లో వచ్చిన ‘భార‌తీయుడు’ ఓ సంచలనం. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్. రెహమన్ ఇచ్చిన.. అదిరేటి డ్రస్సు , మాయా మచ్ఛీంద్ర ,...

నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం

నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఇకపై పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి తెలిసిందే....

రేవంత్ సన్మానం చేస్తే కేసీఆర్ వద్దంటారా ?

తెలంగాణ సాధనలో మీది ప్రముఖ పాత్ర... వచ్చేయండి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ చాలా మందిని పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close