మీడియా వాచ్ : ఆగిపోయిన ప్రైమ్ 9 న్యూస్..!

తెలుగు మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టి రాజకీయంగా పలుకుబడి సంపాదించుకుందామని వచ్చేస్తున్న వారందరికీ… చేతి చమురు బాగానే వదులుతోంది. ఏంచేయాలో తెలియక చానెళ్లను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సిక్స్ టీవీ, ఏపీ24/7 లాంటి చానళ్ల ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వంతు ప్రైమ్ 9 న్యూస్ వంతు వచ్చింది. ఆ చానళ్ల ప్రసారాలు పూర్తిగా ఆగిపోయాయి. శాటిలైట్ ప్రసారాలు ఇవ్వాలంటే.. ఎర్త్ స్టేషన్ ఉన్న వారితో ఒప్పందం చేసుకోవాలి . అలా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో వారు ప్రసారాలు నిలిపివేశారు.

ప్రైమ్ 9 న్యూస్ చానల్ అనేదాన్ని మొదట… జనసేనకు మద్దతుగా అంటూ ప్రారంభించారు. తర్వాత వైసీపీకి మద్దతుగా టోన్ మార్చారు. కానీ ఆ చానల్‌ను పట్టించుకున్న వారెవరూలేరు. మొదట్లో వైసీపీ భజన పరుడిగా పేరున్న జర్నలిస్ట్ సాయి ఈ చానల్‌లో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఆయన ఉన్నాడో లేదో తెలీనట్లుగా బండి నడుస్తోంది. సాయి సొంత చానల్ పెట్టుకుని ప్రభుత్వాన్ని పొగుడుతూ.. విపక్షాల్ని విమర్శిస్తూ.. వీడియోలు చేసుకుంటున్నారు.కానీ ప్రైమ్ 9న్యూస్ మాత్రం రోజు రోజుకు దిగజారిపోయింది.

బాబి ఆనంద్ అనే వ్యక్తి ఇప్పటి వరకూ సీఓఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలో చానల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నారు. డబ్బులు తీసుకుని రిపోర్టర్ ఉద్యోగాలు ఇచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడుచానల్ ప్రసారాలు నిలిపివేయడంతో పెట్టుబడి పెట్టిన వారు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. వైసీపీకి మద్దుతుగా ఉంటున్నందున ఆ పార్టీకి చెందిన ఎవరినైనా బిగ్ షాట్‌ను పట్టుకుని బండి నడిపించాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి సాయి కరెక్టని అతన్నే అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న చానల్స్ నిలబడినట్లుగా చరిత్రలో లేదు కాబట్టి.. ప్రైమ్ 9 న్యూస్ కూడా… అత్యాశపరుల చేతుల్లో నలికిపోయిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close