మోదీ ప్రైవేటు జపం..! అనుమానాలెలా తీరుస్తారు..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కువగా ప్రైవేటు జపం చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలోనూ ముఖ్యమంత్రులకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి ఇది సడన్ టర్న్ కాదు. మొదటి నుంచి ఇదే విధానం. ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం ఇస్తేనే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని బీజేపీ మనసా..వాచా నమ్ముతుంది. దీనిపై గతంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ బీజేపీ ఆచరణలో పెట్టే సరికి మాత్రం రకరకాల విమర్శలు వస్తున్నాయి. కొత్తగా వచ్చే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం వేరు… ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వేరు. ప్రైవేటును కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రోత్సహించవచ్చు కానీ… ప్రభుత్వ సంస్థలను వాటికి అప్పగించి ప్రోత్సహించడం కరెక్ట్ కాదన్నది కొంత మంది వాదన.

స్టీల్ ప్లాంట్ ను వంద శాతం అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ప్రైవేటీకరణపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాస్త ఆలోచిస్తే.. స్టీల్ ప్లాంట్ చాలా లాభదాయకమైన ప్రాజెక్ట్. సొంత గనులు లేకపోవడం వల్లే సమస్య వస్తోంది. ప్రభుత్వాలు తల్చుకుంటే స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడం ఒక్క రోజులో పని. కొంత మంది మైనింగాసురులు ఇక్కడి ఐరన్ ఓర్‌ను చైనాకు తరలించగలగ్గా లేనిది…. విశాఖ తరలించలేరా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే సులువుగానే సమాధానం దొరుకుతుంది. ఇలాంటి ప్రైవేటీకరణనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పైగా… ప్రభుత్వ రంగ సంస్థలు.. వంద ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. వాటి విలువ ఇప్పుడు .. కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. సంస్థను కొనుగోలు చేసే ప్రైవేటు వ్యక్తులు… ఫ్యాక్టరీని మూసేసి.. స్థలాలను అమ్ముకోవడంతోనే సమస్య వస్తోంది. హిందూస్థాన్ జింక్ విషయంలో అదే జరిగింది. అంటే బంగారు బాతు గుడ్లను పెట్టే బాతును ఒక్క సారిగా చంపేసుకోవడం అన్నమాట.

ప్రైవేటీకరణ చేయడం కన్నా.. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం మంచిదని నిపుణుల అభిప్రాయం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తృణానికో.. పణానికో… ప్రైవేటుకు కేటాయిస్తే… వారు నడపడం అసాధ్యం. వారు మరో విధంగా ఆదాయం చూసుకుంటారు. దీని వల్ల ప్రొడక్టివిటీ పెరగకపోగా మరింత పతనం అవుతుంది. ఉత్పత్తి కార్యకలాపాలు జోరుగా సాగినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. స్టీల్ ప్లాంట్ తీసుకునే పోస్కో కానీ మరొకటి కానీ… లాభాల్లోకి రావాలంటే గనులను సొంతంగా పొందాలి. లేకపోతే ఆ సంస్థకూ నష్టాలు వస్తాయి. మరి ఆ సంస్థ ఎలా ముందుకెళ్తుంది..? అయితే ప్రభుత్వమే గనులు కేటాయించాలి లేకపోతే… ఆ సంస్థ భూములమ్మేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది.

రైల్వేతో సహా మొత్తంగా ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటీకరణకు మోడీ పచ్చ జెండా ఉపారు. ఇప్పటికే రైళ్లు చాలా పెద్ద ఎత్తున ప్రైవేటు చేతుల్లోకి వెళ్లాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందకపోగా… మరింత ఆర్థిక భారం పడేలా పరిస్థితి మారితే మాత్రం..ప్లాన్ ఫెయిలయినట్లే. కార్పొరేట్ కంపెనీలకు కావాల్సినంత లాభం చేకూర్చినట్లే. అందుకే కొత్తగా ప్రైవేటుకంపెనీలను ప్రోత్సహించడం ముఖ్యం కానీ.. ఉన్న వాటిని ప్రైవేటు ఖాతాలోకి మార్చడం కీలకం కాదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close