చెక్…! కృష్ణపట్నంలో “పోస్కో”..!

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న విపక్షాలకు షాక్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో కార్మిక సంఘాల నేతలకు చెప్పినట్లుగా పోస్కో ప్లాంట్‌ను ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ మేరకు చర్చలకు రావాలని పోస్కోకు ఏపీ సర్కార్ ఆహ్వానం పంపింది. కొరియా నుంచి ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరుతూ పరిశ్రమల శాఖ పోస్కో ఇండియా సీఎండీ సంగ్‌ లేకి లేఖ రాశారు. ఏపీకి వస్తే పరిశ్రమ ఏర్పాటు విధివిధానాలపై చర్చిద్దామని అందులో కోరారు.

పోస్కో విశాఖలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుందని ఒప్పందం చేసుకుందని… కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ తరుణంలో వారి విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం.. పోస్కోతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పోస్కో బృందం ఇప్పటికే కృష్ణపట్నం వచ్చి పోర్టు అధికారులతో చర్చలు జరపిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది కాబట్టి.. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన పోర్టు పక్కనే స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ఎగుమతులు, దిగుమతులకు ఎంతగానో దోహదం చేస్తుందని ప్రభుత్వం పోస్కోకి చెబుతోంది. పోస్కో వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటే వెంటనే భూమి అప్పగించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది.

పోస్కో సంస్థ కృష్ణపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. అది ఏపీ సర్కార్ సాధించిన అతి పెద్ద విజయంగా మారుతుంది. పెట్టుబడులు రావడం లేదని అంటున్న విపక్షాలకు… విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పోస్కోకు కట్ట బెట్టే ప్రయత్నం చేస్తున్న విమర్శలకు ఒక్క సారే కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది.అయితే స్టీల్ ప్లాంట్ పెట్టడం అంతతేలికనా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ప్రభుత్వం పట్టుదలగా ఉందికాబట్టి… పోస్కో ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close