‘ఆచార్య‌’కు కొత్త టెన్ష‌న్

ఏప్రిల్ నుంచి పెద్ద సినిమాల హ‌డావుడి మొద‌లు కానుంది. ఈనెల 9న `వ‌కీల్ సాబ్` వ‌స్తున్నాడు. మేలో అయితే జాత‌రే జాత‌ర‌. ఒకేనెల‌లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు వ‌స్తున్నాయి. అందులో బోణీ కొట్టేది మెగాస్టార్ `ఆచార్య‌`నే. మే 13న ఈ సినిమా విడుదల అవ్వాలి. ఇంకా.. 40 రోజుల స‌మ‌యం ఉంది. షూటింగ్ ఇంకాస్త బాకీ ఉంది. దాంతో గొడ‌వ లేదు. ప్ర‌మోష‌న్లూ మెల్ల‌మెల్ల‌గా మొద‌లెట్టేస్తారు. అయితే సీజీ వ‌ర్క్‌తోనే ఈ సినిమాకి త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం.

కొర‌టాల శివ సినిమాల్లో సీజీ వ‌ర్కుల‌కు పెద్దగా స్కోప్ ఉండ‌దు. ఆయ‌న క‌థ‌ల‌న్నీ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగేవే. కానీ.. `ఆచార్య‌`లో సీజీ వ‌ర్క్ ప్రాధాన్యం ఉంది. ఇది పురాత‌న దేవాల‌యాల నేప‌థ్యంలో సాగే క‌థ‌. అందుకు సంబంధించిన కొన్ని సెట్స్ వేసినా, అవ‌న్నీ పాక్షికంగానే. ఎక్కువ‌గా సీజీపై ఆధార‌ప‌డిపోయార‌ని టాక్‌. అయితే ఆ పనులు చాలా వ‌ర‌కు పెండింగ్‌లో ఉండిపోయాయ‌ని తెలుస్తోంది. సీజీతో పెట్టుకుంటే ఓ ప‌ట్టాన పూర్త‌వ‌దు. సీజీ కంపెనీలు… చెప్పిన స‌మ‌యానికి వ‌ర్క్ ఇవ్వ‌డానికి స‌తాయిస్తుంటాయి. ఇప్పుడు ఆ గోల `ఆచార్య‌`కూ మొద‌లైంద‌ని టాక్‌. సీజీ నిపుణుల‌తో ప‌నిచేయ‌డం.. కొర‌టాల శివ‌కు ఇదే తొలిసారి. కాబ‌ట్టి.. ఆయనా టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. అనుకున్న స‌మ‌యానికి సీజీ వ‌ర్క్స్ వ‌స్తాయా, రావా? అనే సందేహాలు ఉన్నాయ‌ని, అయితే… ఓ టీమ్ మాత్రం కేవ‌లం ఆచార్య సీజీ వ‌ర్క్స్ పైనే ప‌నిచేస్తోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close