సున్నా వడ్డీ..రైతులకు నిజంగా సున్నానే..!

రైతులకు సున్నా వడ్డీ పథకం కింద.. సీఎం జగన్ రూ. 128 కోట్లను .. దాదాపుగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సగటున ఒక్కో రైతుకు రూ. రెండు వేల రూపాయలు మాత్రమే దక్కబోతున్నాయి. రూ. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు మాత్రమే.. వారు కట్టిన వడ్డీని వెనక్కి ఇవ్వబోతున్నారు. సకాలం అంటే.. ఏడాది లోపే. బ్యాంక్‌లో అగ్రి లోన్.. రూ. లక్ష తీసుకుంటే.. ఏటా వడ్డీ రూ. వెయ్యికూడా అవ్వదు. రైతులు సమయానికి చెల్లింపులు చేయడం చాలా కష్టం. అది తెలిసి కూడా..అనేకానేక నిబంధనలు పెట్టి.. చివరికి.. లబ్దిదారుల సంఖ్యను కుదించింది. ఈ సున్నా వడ్డీ పథకంపై అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వం మారిన కొత్తలో సున్నా వడ్డీకి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. అప్పుడు ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్… సున్నా వడ్డీ కోసం.. రూ. 630 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించిందని రికార్డులు బయటకు వచ్చాయి. అప్పుడు సీఎం జగన్ సున్నా వడ్డీ కోసం చెల్లించాల్సింది రూ. 11600 కోట్లు అని.. ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం ఐదు శాతమే ఇచ్చిందని… తమ ప్రభుత్వం రైతుల్ని అలా మోసం చేయదని చెప్పుకొచ్చారు. రైతులకు సున్నా వడ్డీ పథకం.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో.. ప్రారంభమయింది. అప్పట్లో రూ. లక్ష వరకూ రుణాలకు వర్తింప చేశారు. టీడీపీ హయాంలో దీన్ని రూ. మూడు లక్షలకు పెంచారు.

జగన్ సర్కార్ కూడా.. మూడు లక్షల వరకూ కొనసాగిస్తుందని రైతులు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీఎంజగన్ లక్ష వరకే వర్తింప చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. సున్నా వడ్డీ రుణాలకు.. ఏడాదికి రూ. రెండు వేల కోట్లకుపైగా అవుతాయని అసెంబ్లీలోనే జగన్ తేల్చి చెప్పారు. కానీ విడుదల చేస్తోంది మాత్రం… రూ. వంద కోట్లకు అటూఇటుగా. రైతుల్ని సున్నా వడ్డీ పేరుతో జగన్ సర్కార్.. మాయ చేసిందని.. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సున్నా వడ్డీ విషయంలో చేస్తున్న పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. అయితే… ఇచ్చే రూ. 120 కోట్లకే..ఐదారు కోట్లు పెట్టి ప్రచారం చేసుకోవడం ఇందులో కొసమెరుపు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close