వ్యూహకర్తలుగా “పీకే”కు పోటీ ఇస్తున్న శిష్యులు..!

ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు… రాజకీయ పార్టీలకు హాట్ ఫేవరేట్. తిమ్మిని బమ్మిని చేసి అయినా విజయాన్ని అందిస్తారని ఆయనపై చాలా నమ్మకం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఐప్యాక్ కంపెనీని నడిపించే బాధ్యతను తన సహచరులకే ఇచ్చేస్తున్నానని ప్రకటించారు. అయితే.. ఇప్పటికే.. ఆయన సహచరులు పెద్ద ఎత్తున ఆయన నుంచి విడిపోయి.. సొంత స్ట్రాటజీ కంపెనీలు పెట్టుకుని స్ట్రాటజిస్టులుగా మారిపోయారు. ఇలాంటి వారిలో ఒకరైన సునీల్ కణుగోలు అనే యువకుడే… తమిళనాడులో అన్నాడీఎంకే .. పరువు కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. అన్నాడీఎంకే స్ట్రాటజిస్ట్‌గా పని చే్సి.. తెర వెనుక వ్యూహాలను రూపొందించడంలో సునీల్ కణుగోలు పాత్ర కీలకం. అందుకే తమిళనాట ఇప్పుడు ఆయనకు డిమాండ్ పెరిగింది.

అన్నాడీఎంకే ఘోరపరాజయం పాలవుతుందని అందరూ అంచనా వేశారు.  గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అదే సమయంలో శశికళ వర్గం దూరమయింది. ఈపీఎస్.. ఓపీఎస్ ఇద్దరూ కీచులాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేను కాపాడటం ఎవరి తరం కాదని అనుకున్నారు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అనూహ్యంగా గట్టిపోటీ ఇచ్చారు. దానికి కారణం స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకున్న సునీల్ కణుగోలు సలహాలే.  పీకే..తన ఐ ప్యాక్ కంపెనీని ప్రారంభించి.. స్ట్రాటజిస్ట్‌గా బీజేపీకి పని చేయడం ప్రారంభించిన కొత్తలో… సునీల్ కణుగోలు కూడా.. సభ్యుడు. అయితే ఆ తర్వాత ఆయన పీకే టీం నుంచి బయటకు వచ్చారు. స్వతహాగా తమిళనాడుకుచెందిన వాడు కావడంతో మొదటగా డీఎంకే కోసం పని చేశాడు. డీఎంకే..  పీకేతో డీల్ సెట్ చేసుకోవడంతో.. ఆయన అన్నాడీఎంకేకు  స్ట్రాటజిస్ట్‌గా మారారు.

అన్నాడీఎంకే ప్రకటించిన ఉచిత పథకాలు…  తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.. ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. రైతులకు రుణమాఫీతో పాటు.. అనేక ఉచిత పథకాలు ప్రకటించారు. మహిళల్ని ఆకట్టుకునే పథకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ వర్కవుట్ అయ్యాయి. అన్నాడీఎంకే కూటమిని బలమైన ప్రతిపక్షంగా నిలిపేందుకు సహకరించాయి. తమిళనాడులో ఓ సారి గెలిచిన పార్టీ రెండో సారి అధికారంలోకి రాదు. ఆ సంప్రదాన్ని బ్రేక్ చేసిన అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉంది..అంటే.. ఎంత తీవ్ర అధికార వ్యతిరేకత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సునీల్ తన వ్యూహచాతుర్యంతో  ఎంతో కొంత మెరుగైన స్థితిని అన్నాడీఎంకే్ తెచ్చి పెట్టారు.

పీకే టీంలో అప్పట్లో చేసిన వారంతా… సొంత స్ట్రాటజిస్ట్‌లుగా మారుతున్నారు. సునీల్ కణుగోలు.. తమిళనాడులో స్థిరపడగా.., రాబిన్ శర్మ అనే స్ట్రాటజిస్ట్ ఏపీలో టీడీపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు కూడా పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పీకే టీంలో కీలకంగా వ్యవహరించేవారు.. సొంత స్ట్రాటజీ కంపెనీలు పెట్టుకుంటున్నారు. దీంతో.. పీకే రిటైరైతే… ఐ ప్యాక్ ప్రాభవం కోల్పోతుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close