యాక్ష‌న్ హీరోగా అభిరామ్ ఎంట్రీ

తేజ సినిమాలంటే.. ప్రేమ‌క‌థ‌లే గుర్తొస్తాయి. కొత్త‌వాళ్ల‌తో ఎప్పుడూ ప్రేమ‌క‌థ‌లే తీశాడు తేజ‌. ద‌గ్గుబాటి ఇంటి నుంచి వ‌స్తున్న కొత్త హీరో అభిరామ్ ని తేజ సినిమాతో ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు అన‌గానే.. ఇది కూడా మ‌రో ల‌వ్ స్టోరీ ఏమో అనుకున్నారంతా. అయితే.. తేజ ఈసారి రూటు మార్చాడు. అభిరామ్ కోసం యాక్ష‌న్ క‌థ‌ని రెడీ చేశాడ‌ట‌. సురేష్ బాబు కూడా ఇప్పుడు ఆ క‌థ‌ని ఓకే చేసేశాడు.

తేజ స్కూల్ సెప‌రేటుగా ఉంటుంది. స్క్రిప్టు లాక్ చేసి, అప్పుడు షూటింగ్ మొద‌లెట్ట‌డం ఉండ‌దు. రాస్తూ.. రాసింది తీస్తూ పోవ‌డ‌మే. కానీ..సురేష్ బాబు స్కూల్ వేరు. స్క్రిప్టు లాక్ చేశాకే షూటింగ్‌. పైగా త‌న‌యుడి సినిమా కదా..? ఏమాత్రం రిస్కు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. అందుకే సురేష్ బాబు కోసం.. తేజ త‌న ప‌ద్ధ‌తి మార్చాడు. మొద‌టి సార్‌.. పూర్తి స్థాయి స్క్రిప్టు సిద్ధం చేసి, బౌండెండ్ స్క్రిప్టు సురేష్ బాబు చేతిలో పెట్టాడు. అదిప్పుడు ఓకే అయిపోయింది. నిజానికి తేజ `చిత్రం 1.1` క‌థ‌ని రెడీ చేసి, దాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. అంత‌లో అభిరామ్ ప్రాజెక్టు వ‌చ్చింది. అభిరామ్ కోసం `చిత్రం 1.1`ని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టేశాడు తేజ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close