ఒబామా – పిల్లలు: విడదీయలేని అనుబంధం

హైదరాబాద్: దివంగత ప్రధాని జవహర్‌లాల్ ‘చాచా’ నెహ్రూలాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పిల్లలంటే విపరీతమైన ప్రేమాభిమానాలు. చిన్న పిల్లలు కనబడితే కొద్దిసేపు వారితో గడపకుండా ఉండరు. గత ఎనిమిదేళ్ళుగా అమెరికా అధ్యక్షుడి హోదాలో దేశంలోగానీ, విదేశాలకు వెెళ్ళినాగానీ ఆయన పిల్లలతో ఆడుకున్నప్పుడు, ముద్దాడినప్పుడు తీసిన ఫోటోలతో అమెరికా ఔత్సాహిక పారిశ్రామికవేత్త మైఖేల్ స్కోల్నిక్ ట్విట్టర్‌లో #ObamaAndKids పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ సృష్టించారు. అది ఇప్పుడు ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఒబామా ముద్దాడిన పిల్లలలో ఇండియన్ అమెరికన్స్‌, ఆఫ్రికన్ అమెరికన్స్‌తోసహా అన్ని రంగులవారు, జాతులవారు ఉన్నారు. ఆ ఫోటోలలో పసిపిల్లలతో ఆయన చేసిన అనేక ఫీట్లలో కొన్ని నవ్వుపుట్టించేవిధంగా ఉన్నాయి. ObamaAndKids1 ఒబామాకు మాలియా(17), సాషా(14) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అధ్యక్ష పదవినుంచి పదవీ విరమణ చేసిన తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అనేకసార్లు ఇంటర్వూలలో చెప్పారు. అమెరికా అధ్యక్షుల చరిత్రలో పిల్లలపై ఇంత ప్రేమాభిమానాలున్న వ్యక్తి మరొకరు లేరని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close