విశాఖలో పీవీ సింధుకు ఉచితంగా రెండెకరాలు..!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఏపీ సర్కార్ భారీ నజరానా ఇచ్చింది. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడెమీ పెట్టేందుకు రెండు ఎకరాలను ఉచితంగా ఇచ్చింది. విశాఖ రూరల్‌లోని చిన్నగదిలి అనే గ్రామంలో రెండు ఎకరాలను కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూమి ప్రస్తుతం పశు సంవర్థక శాఖ అధీనంలో ఉంది. వారి దగ్గర్నుంచి యువజన, క్రీడా శాఖకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖ నుంచి సింధుకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు ఎకరాల స్థలంలో కనీసం రూ. ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి.. బ్యాడ్మింటన్ అకాడమీ.. అలాగే.. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిబంధనలు పెట్టారు. అలాగే అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే భూమి ఉప‌యోగించాల‌ని క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌కోసం వాడ‌కూడ‌ద‌ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అకాడ‌మీ ద్వారా ప్రతిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాల‌ని సూచించింది.

మామూలుగా అయితే ప్రభుత్వం ఎప్పుడూ ఉచితంగా ఇవ్వదు. కానీ ఏపీ సర్కార్ అనూహ్యంగా ఉచితంగా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఎంతో కొంత విలువ కట్టి ఉంటే… ఆ స్థలం విషయంలో పీవీ సింధుకు యాజమాన్య హక్కులు వచ్చి ఉండేవి. పూర్తి ఉచితంగా ఇస్తున్నందున ప్రభుత్వం ఎప్పుడైనా సరే వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చిన నిబంధనలు పాటించలేదని ఒక కారణం చెప్పి స్వాధీనం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం చూస్తే.. ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి.. పీవీ సింధు అకాడమీ ఏర్పాటు చేసి.. ఎవరి వద్దనైనా ఫీజు వసూలు చేసినా .. నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అకాడమీ కోసం స్థలం కావాలని పీవీ సింధు గత ప్రభుత్వాన్ని కోరింది. అమరావతిలో ఐదెకరాలు ఇవ్వాలని అప్పట్లో చంద్రబాబు నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రక్రియ సాగుతూండనే ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వానికి పీవీ సింధు ప్రతిపాదనలు నచ్చాయి. అయితే అమరావతిలో కాకుండా తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్న విశాఖలో ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close