నేటి “వైరల్ స్టార్” అంబటి రాంబాబు..!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. సోషల్ మీడియాలో ఎలా ఫేమ్ తెచ్చుకోవాలో లెటెస్ట్‌గా కనిపెట్టినట్లుగా ఉన్నారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో… రెండు నాలుకల మాటలే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు… ముఖ్యమంత్రిని ఇన్‌స్పైర్ చేయడానికి కబుర్లు చెప్పడమే కాదు.. చివరికి తన సొంత సామాజికవర్గాన్ని కూడా అత్యంత నీచంగా కించ పర్చుకోవడానికి వెనుకాడలేదు. ఆయన ఇంటర్యూ పేరుతో సోషల్ మీడియాలోకి వచ్చిన ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంబటి రాంబాబు మాటల్ని చూసి.. అందరూ నోళ్లు నొక్కుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లపై వైసీపీ నేతలు తరచూ చేసే విమర్శ… హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంటర్యూలో కూడా.. అంబటి రాంబాబు అదే వాగ్ధాటి చూపించారు. ఆయన వాగ్ధాటికి యాంకర్ కూడా అబ్బురపడింది. అదే సమయంలో ఆమెకు ఓ డౌట్ వచ్చింది.. అదేమిటంటే.. చంద్రబాబు, లోకేష్ సరే.. ముఖ్యమంత్రిగా ప్రజల బాగోగులు దగ్గరుండి చూసుకోవాల్సిన జగన్ ఎందుకు బయటకు రావడం లేదు అని..? అదే విషయాన్ని నేరుగా అంబటి రాంబాబునే అడిగింది.

దానికి కూడా అంబటి రాంబాబు ఎక్కడా తడుముకోలేదు. అదే వాగ్దాటితో సమాధానం ఇచ్చారు.. ఏమని అంటే… ఇది కరోనా సమయం కదా.. కరోనా సమయంలో సీఎంను బయటకు రమ్మంటారా.. అసలుఅలా అడగడానికి కామన్‌సెన్స్ ఉందా.. అన్నట్లుగా రెచ్చిపోయారు. అంతకు ముందు ప్రతిపక్ష నేతలు కరోనాలో హైదరాబాద్‌లోనే ఉంటున్నారని విమర్శించిన ఆయన జగన్‌కు మాత్రం కరోనా వల్ల బయటకు రావడం లేదని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించలేదు. ఆయన మాటల తీరు చూసి.. యాంకర్ కూడా అబ్బురపడింది. ఆ ఇంటర్యూలోనే మరో చోట.. కులాల ప్రస్తావన వచ్చింది. అందులో కాపు కులంపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టించేలా ఉన్నాయి. ఆయన కులాన్ని ఆయన అంత దారుణంగా కించ పర్చుకోవడం… సోషల్ మీడియాలోనూ హైలెట్ అవుతోంది.

ముఖ్యమంత్రికి .. ఆయన సామాజికవర్గం నచ్చదు కాబట్టి.. ఆయనను మెప్పించడానికి అంబటి రాంబాబు దిగజారిపోయారన్న చర్చ నడుస్తోంది. ఆయనపై సొంత సామాజికవర్గంలోనే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఏదైనా విమర్శలు చేస్తే.. ఆయనపై దాడి చేయడానికి .. ఆయనకు కులాన్ని అంటగట్టి.. నీచమైన విమర్శలు చేయడానికి కాపు సామాజికవర్గ మంత్రుల్నే వైసీపీ ఎగదోస్తుంది. ఇప్పుడు వారితోనే వారి కులాల్ని కూడా ఎగతాళి చేయిస్తున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అంబటి రాంబాబుకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం అంటూ లేదని.. వైరల్అవుతున్న ఇంటర్యూతో తేలిపోయిందంటున్నారు. అందుకే.. ఇప్పటికి వైరల్ స్టార్‌గా అంబటి రాంబాబు నిలుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close