పరీక్ష పాసైతేనే పర్మినెంట్.. వాళ్లకి షాకిచ్చిన ఏపీ సర్కార్..

రెండేళ్ల క్రితం పరీక్షలు పెట్టి నియమించుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మళ్లీ పరీక్షలు పెడుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షకు షెడ్యూల్ విడుదల చేసింది. రెండేళ్ల కిందట రూ. పదిహేను వేల జీతానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీల కింద ఉద్యోగుల్ని తీసుకున్నారు. వారిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని.. ప్రొబేషన్‌లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. మళ్లీ పరీక్షలు పెడతామని అప్పట్లో చెప్పలేదు. కానీ ఇప్పుడు తాము పెట్టే పరీక్షల్లో పాసవ్వాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. వంద మార్కులకు పెట్టబోయే పరీక్షలో కనీసం నలభై మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే ప్రొబేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించారు.

నెలాఖరులో మూడు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ప్రస్తుతానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా ముఫ్పై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని ఇప్పటి వరకూ ప్రభుత్వం తాము కల్పించిన పర్మినెంట్ ఉద్యోగాల కేటగిరిలో వేసి లెక్కలు చెబుతూ వస్తోంది. అయితే వారు ఇంకా ప్రొబేషన్‌లోకి రాలేదు. ఇప్పుడు రావాలంటే పరీక్షలు రాయక తప్పని పరిస్థితి. ఎంత లేదన్నా వందకు వంద శాతం పరీక్షలు పాసయ్యే పరిస్థితి లేదు కాబట్టి వారిలో సగం మందికి మాత్రమే ఇప్పుడు ప్రొబేషన్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

పరీక్షలు పూర్తయిన తర్వాత కనీసం ఓ లక్ష మందికి ప్రొబేషన్ ఇచ్చినా ఆ మేరకు ప్రభుత్వం పై పెద్ద ఎత్తున భారం పడుతుంది. వారికి స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒక్క సారిగా లక్ష మందికి ప్రొబేషన్ ఇవ్వాలంటే అది మరిన్ని ఆర్థిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం పరీక్షలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close