మోహన్‌బాబులో పశ్చాత్తాపం కనిపిస్తోందా !?

బాలకృష్ణ అల్లుడు లోకేష్ ఓటమి కోసం మంగళగిరిలో తాను ప్రచారం చేశానని కానీ అదేమీ పట్టించుకోకుండా బాలకృష్ణ .. విష్ణుకు మద్దతిచ్చి ఓటేశాడని మంచు మోహన్ బాబు కృతజ్ఞతా స్వరంతో చెప్పుకొచ్చారు. “మా” ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాలకృష్ణ ఇంటికి వెళ్లి మోహన్ బాబు, విష్ణు సమావేశం అయ్యారు. సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. పదహారో తేదీన ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రీకొడుకులు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.

మోహన్ బాబు బాలకృష్ణను పొగడటానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఎన్టీఆర్‌కు ప్రతి రూపం బాలకృష్ణ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల నాటి పరిస్థితులను మనసులో పెట్టుకోకుండా మద్దతిచ్చారని.. ఆయనకు సంస్కారవంతుడని కొనియాడారు. “మా” భవనం విషయంలో అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారన్నారు. రాజకీయాలకు.. మా ఎన్నికలకు సంబంధం ఏమిటో కానీ మోహన్ బాబు మాత్రం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ తాను తప్పు చేశానన్నట్లుగా మాట్లాడటం ఆశ్చర్యకరంగా మారింది.

మంచు విష్ణు కూడా ఇండస్ట్రీలో పెద్దలందర్నీ కలుస్తున్నానని.. అందరినీ కలుపుకుని వెళ్తానని చెబుతున్నారు.ఇప్పటికే కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, పరుచూరి బ్రదర్స్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. రేపోమాపో చిరంజీవి కూడా కలుస్తానన్నారు. “మా” అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న విష్ణు ప్రమాణ స్వీకారం మాత్రం విడిగా చేయాలనుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఎన్నికల అధికారి వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాజీనామాలు చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్‌నూ ఆహ్వానిస్తున్నామన్నారు. వారితో కలిసి పని చేస్తామని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close