2 గంట‌ల 35 నిమిషాల ‘అఖండ‌’

డిసెంబ‌రు 2న అఖండ విడుద‌ల అవుతోంది. శుక్ర‌వారం సెన్సార్ కూడా పూర్త‌య్యింది. సినిమా ర‌న్ టైమ్‌.. 2 గంట‌ల 35 నిమిషాలు. ఫ‌స్టాఫ్ 90 నిమిషాల‌కు క‌ట్ చేశారు. సెకండాఫ్ మ‌రో 5 నిమిషాలు ఎక్కువ‌. చివ‌ర్లో 5 నిమిషాల మేకింగ్ వీడియో ఒక‌టి ఉంది. యాడ్స్‌, టైటిల్ కార్డ్ ఇవ‌న్నీ చూసుకుంటే.. సినిమా 2 గంట‌ల 45 నిమిషాల వ‌ర‌కూ వ‌చ్చింద‌ని టాక్‌. కొన్ని బీప్స్‌తో యూ బై ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

బోయ‌పాటిది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ స్టైల్‌. సింహా, లెజెండ్ సినిమాలకు ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మెట్‌నే అఖండ‌కీ ఫాలో అయ్యాడ‌ని తెలుస్తోంది. హీరో, ఇంట్ర‌డ‌క్ష‌న్‌, త‌న పోరాటాం.. ఇవ‌న్నీ ఫ‌స్టాఫ్‌లో చూపించి, స‌రిగ్గా ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కి అఘోరా పాత్ర‌ని రంగంలోకి దింపారు. సెకండాఫ్ అంతా.. అఘోరా పాత్రే కీల‌కం. ఇంట్ర‌వెల్ ఫైట్‌, క్లైమాక్స్ ఫైట్ రెండూ.. భారీ ఎత్తున తీర్చిదిద్దారు. పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేని సినిమా ఇది. ఐటెమ్ సాంగుల జోలికి కూడా పోలేదు. బాల‌య్య పేల్చిన డైలాగులు, శ్రీ‌కాంత్ విల‌నిజం, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌.. ఈసినిమాకి కీల‌కం. విజువ‌ల్స్ భారీ లెవల్ లో ఉన్నాయ‌ని, త‌మ‌న్ ఆర్‌.ఆర్‌.. బాగా ప్ల‌స్ అయ్యింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close