అవి కృతజ్ఞతతో వచ్చిన కన్నీళ్లు : సాయి పల్లవితో ఇంటర్వ్యూ

సాయి పల్లవి… చాలా తక్కువ సినిమాలతోనే తనకంటూ ఒక బ్రాండ్ ని సొంతం చేసుకుంది. సాయి పల్లవి నుంచి ఒక సినిమా వస్తుందంటే ‘మంచి సినిమా’ అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆమె నుంచి వస్తున్న సినిమా “శ్యామ్ సింగ రాయ్”, నాని హీరో. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ సినిమా ముచ్చట్లని పంచుకుంది సాయి పల్లవి. సంగతులు ఇవే..

* శ్యామ్ సింగరాయ్ లోకి ఎలా వచ్చారు ?

డైరెక్టర్ గారు స్క్రిప్ట్ పంపించారు. చదివాక చాలా డెప్త్ వున్న రోల్ అనిపించింది. మొదట పాత్ర మానసిక స్థితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించా. చాలా బలమైన పాత్ర ఇది.

* ఈ స్క్రిప్ట్‌కి మిమ్మల్ని బాగా ఆకర్షించింది ఏమిటి?

దేవదాసి పాత్ర నన్ను బాగా ఆకర్షించింది. దేవదాసిల గురించి కొంత తెలుసు. అయితే ఇందులో వారి మానసిక స్థితి ఎలా వుంటుంది, వారు ఎలా ఆలోచిస్తారు ..ఇలాంటి విషయాలని లోతుగా పరిశీలన చేశాం.

* శ్యామ్ సింగ్ రాయ్ ఈవెంట్‌లో చాలా ఎమోషనల్ అయ్యారు ?

మనం కళాకారులం. కళని చూసి స్పందిస్తాం. ఈవెంట్ లో కళాకారులు తమ కళని ప్రదర్శిస్తున్నారు. కొందరు నా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. నా వర్క్‌ని ఆదరిస్తున్న తీరు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అందరూ నా గురించి మాట్లాడిన తీరు, నా సినిమాలు చూసి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఇవన్నీ ఒక్కసారిగా కన్నీళ్లు తెప్పించాయి. కృతజ్ఞతా భావంతో వచ్చిన కన్నీళ్లు.

* శ్యామ్ సింగ రాయ్‌ లో డ్యాన్స్ కి ప్రాధాన్యత ఉంటుందా ?

లేదు. డ్యాన్స్ మెయిన్ పాయింట్ కాదు. నా డ్యాన్స్ స్కిల్స్‌ని క్యారెక్టర్‌కి ఎంత అవసరమో అంతే ఉపయోగించుకున్నాం. దర్శకుడు రాహుల్ కి ఈ విషయంలో పూర్తి స్పష్టత వుంది. డ్యాన్స్ ఎంత కావాలో అంతే చేయించారు.

* దేవదాసి పాత్రకు ఎలా సిద్ధమయ్యారు?

దేవదాసీల గురించి రకరకాల కథలు విముంటాం. అయితే ప్రతి ప్రాంతంలోనూ దేవదాసీల విషయంలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. రాహుల్ ఈ సినిమా కోసం ఒక నేపధ్యం తీసుకున్నాడు. ఆ నేపధ్యంకు తగ్గట్టు నేను సిద్దమయ్యా.

* నాని తో మీకిది రెండో సినిమా.. ఎలా అనిపించింది?

ఎంసిఏలో నానికి నాకు ఎక్కువ సీన్లు వుండవు. పైగా ఆ సినిమాలో నేను ‘నాని గారు’ అని పిలుస్తుంటా. కానీ శ్యామ్ సింగ రాయ్ లో మాత్రం అలా కాదు. రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మా ఇద్దరి రోల్స్ లో చాలా లోతు కనిపిస్తుంది.

* దర్శకుడు రాహుల్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

రాహుల్ చాలా స్పష్టత వుంది. సెట్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా వుంటారు. వండర్ ఫుల్ డైరెక్టర్.

*మీ పాత్రలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ?

పాత్రలని ఎంచుకున్నపుడు నేను సాయి పల్లవిలా కాకుండా బయటవ్యక్తిలా ఆలోచిస్తా. ఒక సినిమా చూసినప్పుడు అందులో ఇంపాక్ట్ చెపే కొన్ని పాత్రలు వుంటాయి. నాకు స్క్రిప్ట్ వచ్చినపుడు పాత్రలో ఇంపాక్ట్ వుందాలేదా ? అనేది చూస్తాను.

* కొత్త సినిమా కబుర్లు గురించి

ప్రస్తుతం తెలుగులో శ్యామ్ సింగ‌రాయ్, విరాట ప‌ర్వం చిత్రాల‌తో రెడీగా వున్నాయి. ఓ తమిళ సినిమా చేస్తున్నా. త్వరలోనే ప్రకటిస్తారు. ఇంకో వెబ్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ చదువుతున్నా. త్వరలోనే వివరాలు తెలుస్తాయి.

* అల్ ది బెస్ట్

థ్యాంక్ యూ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close