ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో గుర్తు ట్టారు.  బ్రహ్మక‌మ‌లం చిత్రంతో ఉన్నది టోపీ ఉత్తరాఖండ్ సంప్రదాయ‌ టోపీ.  మెడలో వేసుకున్న కండువా మ‌ణిపూర్ సంప్రదాయానికి సంబంధించిన కండువా. టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చిహ్నం అయితే కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.మణిపూర్‌లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం.

ఈ రెండింటినే ఎందుకు వాడారు అంటే ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని కొంత మంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అక్కడి ప్రజల్ని ఆకట్టుకోవడానికి మోడీ ఇలా చేశారని విశ్లేషిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. ఎప్పుడూ ఇలానే చేస్తూంటారు. గత ఏడాది మార్చిలో టీకా వేయించుకుంటున్న సమయంలోనూ అప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సమీకరణాల్ని చూసుకున్నారు. తాను అసోం సంప్రదాయ కండువా వేసుకుని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి నర్సులతో టీకా వేయించుకున్నారు. వారి గురించి బాగా చర్చ జరిగేలా చేశారు.

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇలా చేస్తారని వచ్చే విమర్శల్ని మోడీ పట్టించుకోరు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించడం ప్రధాని స్టైల్. అది రిపబ్లిక్ డే రోజునా కొనసాగించారని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close