విజయవాడ మెట్రో సర్వేకు వచ్చిన జైకా ప్రతినిధులు

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన పెట్టుబడి పెట్టేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించకపోవడంతో, జపాన్ కి చెందిన జైకా సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో దాని ఆర్ధిక సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి జైకా సంస్థ ప్రతినిధులు నిన్న విజయవాడకు వచ్చేరు. వారితో కృష్ణా జిల్లా కలెక్టర్, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.

మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమయిన అన్ని అనుమతుల కోసం తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వచ్చేమని, సాధారణంగా కొన్ని అనుమతులు మంజూరు చేయడానికి ఏడాది కాలం తీసుకొంటుందని, కానీ తమ అభ్యర్ధన మేరకు 9 నెలలోనే అనుమతులు మంజూరు చేయడానికి అంగీకరించినట్లు రాధాకృష్ణ రెడ్డి జైకా ప్రతినిధులకు తెలియజేసారు.

పి.ఎన్.బి.ఎస్.-ఏలూరు రోడ్-నిడమానూరు మధ్య నిర్మించే కారిడార్-2 ప్రాజెక్టుకి టెండర్లు పిలువగా మొత్తం 10 సంస్థలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మరో మూడు నెలలోగా టెండర్లను ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే పి.ఎన్.బి.ఎస్‌- బందరు రోడ్డు- పెనమలూరు సెంటర్‌ మధ్య నిర్మించే కారిడార్-1 పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కారిడార్-2కి అవసరమయిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలమని జైకా ప్రతినిధులకు రాధాకృష్ణ రెడ్డి హామీ ఇచ్చేరు. ఆ సంస్థ ప్రతినిధులకు ప్రాజెక్టు నిర్మాణం కాబోయే ప్రదేశాలను రాధాకృష్ణ రెడ్డి తదితరులు స్వయంగా చూపించి వారు అడిగిన వివరాలను అన్నటినీ అందజేశారు. 2018లోగా ఈ రెండు కారిడార్ల నిర్మాణం పూర్తి చేయాలనుకొంటున్నామని రాధాకృష్ణ రెడ్డి జైకా సంస్థ ప్రతినిదులకి తెలుపగా వారు తాము కూడా అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close