పాపం ఉద్యోగులు – జీపీఎఫ్ సొమ్మే కాదు వడ్డీ కూడా !

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు మామూలుగా ఝులక్‌లు ఇవ్వడం లేదు. జీపీఎఫ్ సొమ్ము మాయం చేశారని గగ్గోలు పెడుతూంటే… ఇప్పుడు తమ మొత్తం జీపీఎఫ్ సొమ్ము మీద ఉన్న వడ్డీ కూడా కనిపించకుండా పోయింది. జీపీఎఫ్ అకౌంట్ స్లిప్పుల్లో కనిపిస్తున్న మొత్తం.. సెల్ ఫోన్లకు వచ్చిన మెసెజ్‌లలో లేదు. వడ్డీ కలిపి స్లిప్పులు జనరేట్ చేశారు. కానీ.. అకౌంట్ బ్యాలెన్స్ చూపించే మెసెజ్‌లో మాత్రం వడ్డీ కనిపించలేదు. అసలు నిల్వే ఉంది. దీంతో ప్రభుత్వం తమ వడ్డీ డబ్బులు వెనక్కి తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యోగులు రగిలిపోతున్నారు.

తమ ఖాతాల నుంచి నగదు ఇష్టారాజ్యంగా తీసుకోవడం ఏమిటని ఓ వైపు ఉద్యోగులు మథనపడుతూంటే.. కొంచెం.. కొంచెం ఉన్నదంతా ఊడ్చే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకూ రాంగ్ ఎంట్రీ పేరుతో నిధులు తీసుకోగా.. ఇక ముందు.. తమ ఖాతాల్లో నగదు.. సొంత నగదేనని… భావించి ఉన్నది తీసుకున్నా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే జీపీఎఫ్ సొమ్ము నుంచి విత్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగులు లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ రకాల అవసరాల కోసం ఉద్యోగులు ఈ అప్లికే,న్లు పెట్టుకున్నారు. ఇల్లు, వైద్యం, పెళ్లి వంటి కోసం పెట్టుకున్న దరఖాస్తులను ఇంత వరకూ క్లియర్ చేయడం లేదు. అసలు కారణం చెప్పడంలేదు.

ఇప్పుడు జీపీఎఫ్ ఖాతాల్లోని సొమ్ము మెల్ల మెల్లగా మాయమవుతూండటంతో మొదటికే మోసం వస్తోంది. ఉద్యోగులు ఇంకా ఎక్కువ మంది తమ జీపీఎఫ్ సొమ్ములు తిరిగి ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం వడ్డీ ప్రభుత్వం తీసుకోలేదని.. ఖాతాల్లోనే ఉందని ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్లిప్పులకు.. మెసెజ్‌లకు తేడా లు ఎందుకు వచ్చిందో మాత్రం ప్రభుత్వ అధికారులు చెప్పిన పిట్ట కథల్ని ఉద్యోగులకు వినిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close