ప్రజల సొమ్ముతో త్వరలో మరో “సాక్షి” !

ప్రభుత్వానికి ప్రచారం సరిపోవడం లేదు. తమ పథకాల గురించి చెప్పడానికి ఇంకో చానల్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అనధికారికంగా సాక్షి ప్రభుత్వ చానల్‌గా ఉంది. ఇక అత్యధిక రేటింగ్‌లు ఉన్న రెండు ప్రధాన చానళ్లు చేసే పని కూడా అదే. సాక్షి 2, సాక్షి 3 అని టీడీపీ నేతలు వాటిని విమర్శిస్తూ ఉంటారు. ఆ ప్రచారం అంతా సరిపోవడం లేదనుకున్నారేమో కానీ కొత్తగా ప్రభుత్వమే న్యూస్ చానల్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.

పైబర్ నెట్‌కు ఇటీవల గౌతంరెడ్డి అనే జగన్ బంధువును చైర్మన్‌గా నియమించారు. టెక్నికల్‌గా ఏమీ తెలియని గౌతంరెడ్డి … ఆధ్వర్యంలో ఇప్పుడు ఫైబర్‌నెట్ నడుస్తోంది. ప్రచారం సరిపోవడం లేదనుకున్న ప్రభుత్వానికి ఫైబర్ నెట్ ద్వారా . చానల్ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. వెంటనే.. గౌతంరెడ్డి మిగతా పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇది పూర్తిగా న్యూస్ చానల్ తరహాలోనే ఉంటుంది. రెగ్యూలర్ న్యూస్ చానల్ తరహాలోనే పని చేస్తుందని చెబుతున్నారు.

ఎన్నికలకు ముందే ప్రారంభిస్తారు. అందులో సిబ్బంది.. సాక్షి నుంచే ఎక్కువ మంది వస్తారు. అదంతా కామన్. గత ఎన్నికల తర్వాత సాక్షిలో భారంగా మారిన వారందరికీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ పనులు ఇచ్చారు. ఇప్పుడు వారందరికీ ఆ చానల్‌లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చినా వాళ్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఇస్తారని చెబుతున్నారు. అటు ప్రచారానికి ప్రచారం.. ఇటు తమ వాళ్ల కు భద్రత ఇచ్చినట్లుగా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రజల సొమ్ముకు మరో రకంగా టెండర్ వేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close