మునుగోడులో ఉనికి చాటితేనే కాంగ్రెస్‌కు భవిష్యత్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. అలా రాజీనామా చేసినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించగానే ఇలా .. వెంటనే ఉపఎన్నికల కమిటీని నియమిస్తూ ప్రకటన చేశారు. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాంనాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, ఎరావత్రి అనిల్ కుమార్‌లను సభ్యులుగా నియమించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీ, ప్రచారం వంటి వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.

రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పూర్తయిన వెంటనే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌తో సమావేశం అయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి పోతారన్న సమాచారం పక్కాగా ఉండంతో ముందుగా తదుపరి ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. అందుకే అలా రాజీనామా చేయగానే ఇలా ఉపఎన్నికల సన్నాహాలు ప్రారంభించాల్సిందేనని నిర్ణయించారు. అ ప్రకారం వెంటనే స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేశారు.

ఐదో తేదీన మునుగోడులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ద్వారా పార్టీ క్యాడర్ ఎవరూ రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా లేరని చెబుతున్నారు. పాల్వాయి స్రవంతిని కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడారు. అప్పట్నుంచి ఆమె కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపితేనే ఆ పార్టీ పరిస్థితిపై వచ్చే ఎన్నికల్లో కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. లేకపోతే కష్టమే. అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముందు నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ నుంచి ఐ ప్యాక్ ప్యాకప్..!!

ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీమ్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఉన్నట్టుండి మూడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్...

దక్షిణాదిపై మోదీ ఆశలు !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీ విడత పోలింగ్ జరిగే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము...

‘ర‌ణ‌భాలీ’గా రౌడీ దేవ‌ర‌కొండ‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ - రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ర‌ణ‌భాలీ' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా....

‘హ‌రోం హ‌ర‌’.. కాస్త ఆల‌స్యంగా!

ఈనెల 31న రావాల్సిన సినిమా 'హ‌రోం హ‌ర‌'. అయితే అదే రోజున నాలుగైదు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అందుకే 'హ‌రోం హ‌ర‌' ఈ పోటీ నుంచి త‌ప్పుకొంది. జూన్ 14న వ‌స్తున్న‌ట్టు చిత్ర‌బృందం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close