ఎక్స్‌క్లూజీవ్‌: ర‌వితేజ‌తో శ్రీ‌వాస్‌

ప్ర‌స్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు శ్రీ‌వాస్‌. అది పూర్తి కాకుండా ర‌వితేజ‌కు క‌థ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. ర‌వితేజ – శ్రీ‌వాస్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవ‌ల ర‌వితేజ‌కు పూర్తి స్థాయిలో క‌థ కూడా వినిపించేశాడు శ్రీ‌వాస్‌. ఈ క‌థ ర‌వితేజ‌కు బాగా న‌చ్చింది. అందుకే చేతిలో ఉన్న సినిమాలు కొన్నింటికి ప‌క్క‌న పెట్టి, వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని మొద‌లెట్టాల‌ని ర‌వితేజ భావిస్తున్నాడట‌.

క‌థాప‌రంగా చూస్తే… ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అని స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై సెటైరిక‌ల్‌గా సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. గోపీచంద్ – శ్రీ‌వాస్ కాంబోలో సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ర‌వితేజ చేతిలో కూడా కొన్ని సినిమాలున్నాయి. `ధ‌మాకా` పూర్తి కావొచ్చింది. అది అవ్వ‌గానే.. శ్రీ‌వాస్ సినిమా మొద‌ల‌య్యే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close