“ఖైదీల” కోసం వైఎస్ఆర్‌సీపీ !

వైసీపీ నేతలు ఖైదీల కోసం ఆరాట పడుతున్నారు. గత వారం జైల్లో ఉన్న ఎంపీలకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ఓ ప్రైవేటు బిల్లును ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇంత అర్జంట్‌గా జైల్లో ఉన్న ఎంపీల గురంచి ఆయనకు ఎందుకు అభిమానం వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా ఖైదీలకు ప్రైవేటు వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. నేరాలు చేసి జైళ్లలో ఉన్న ఖైదీలకు ఇక నుండి ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా, పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకూ ఖైదీకి అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకు వెళ్లే వారు. అయితే ఖైదీలకు సరైన వైద్యం అందడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద ఎత్తున ఆస్ప్తరులను బాగు చేశామని.. ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం వస్తున్నారని… సమీక్షలు చేసి మరీ చెప్పే ప్రభుత్వ పెద్దలకు.. ఖైదీల విషయానికి వచ్చే సరికి అది మర్చిపోయారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఖైదీలకు సరైన వైద్యం అందడం లేదని.. ప్రైవేటుకు తరలించేందుకు..అదీ కూడా ప్రభుత్వ ఖర్చుతో అందించేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా జీవో వచ్చింది కానీ. .జగన్ పదవి చేపట్టిన కొత్తలోనే ఖైదీల గురించి ఆలోచించారు. 2019 డిసెంబర్ లో జరిగిన ప్రిజన్ డెవెలప్మెంట్ బోర్డు భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖైదీలకు అందుతున్న వైద్య సదుపాయాలపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖను ఆదేశించారు. అప్పట్లో వచ్చిన ప్రతిపాదనను బట్టి ఈ ఏడాది జులై 22న జీవో విడుదల చేశారు. ప్రభుత్వంలో జీవోలు ఎప్పుడు విడుదల చేసినా.. బయట పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే పెడుతున్నారు కాబట్టి తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close