తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో పెరిగేలా సన్నాహాలు చేస్తోంది. అయితే తెలంగాణ రావడంలో తమ పాత్ర కూడా ఉందని చెప్పుకునేందుకు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్ామని కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందని.. ప్రకటించారు.

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను వివిధ రాష్ట్రాల్లోనూ నిర్వహి్తున్నామని ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్‌భవన్లకు ఆహ్వానించి, గవర్నర్ల ఆధ్వర్యంలో జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను అన్ని చోట్లా జరుపుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఢిల్లీలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో జరుగుతాయని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లక్షలాది తెలంగాణ ప్రజలు, కుటుంబాలు భాగస్వాములయ్యాయని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర చాలా కీలకమని కిషన్ రెడ్డి చెబుతున్నారు. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ నేతృత్వంలో బీజేపీ 160 మంది ఎంపీలు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కీలక పాత్ర పోషించామని బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బీఆర్ఎస్ నేత కే. కేశవరావు ఓ సందర్భంగా చెప్పారని.. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం. ఇతర రాజకీయ పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని చెప్పుకొచ్చారు. కారణం ఏదైనా తెలంగాణ సెంటిమెంట్ ను అందిపుచ్చుకోవడంలో చివరి క్షణంలో రంగంలోకి దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం రాకపోకా… బీఆర్ఎస్‌కు మేలు చేస్తున్నట్లుగా మారిపోతోంది. అయినా బీజేపీ నేతలు.. బీఆర్ఎస్ నేతల ట్రాప్ లో పడుతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close