ఈవారం తేల‌నున్న వార‌సుల భ‌విత‌వ్యం

ఈవారం నాలుగైదు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న సినిమాలు రెండే రెండు. ఒక‌టి… ‘అహింస‌’, రెండోది ‘నేను స్టూడెంట్ సార్‌’. ఈ రెండు సినిమాల్లోనూ వార‌సుల హీరోలే న‌టించారు. స్వాతిముత్యంతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ గ‌ణేష్ కి ఇది రెండో సినిమా. తొలి సినిమా యావ‌రేజ్ మార్కులు తెచ్చుకొంది. స్వాతిముత్యం పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగానే గ‌ణేష్ తెర‌పై క‌నిపించాడు. ప్ర‌తీసారీ అదే న‌ట‌న‌, అవే ఎక్స్‌ప్రెష‌న్స్ చెల్లుబాటు కావు. త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకోవాలి. గ‌ణేష్ స్టామినా ఏమిటో ఈ సినిమాతో తేలిపోనుంది. పైగా ఇది స్టూడెంట్ క‌థ‌. హీరోల‌కు స్టూడెంట్ క‌థ‌లు బాగా క‌లిసొచ్చాయి. ఇలాంటి క‌థ‌లతో హిట్లు కొడితే – యూత్ లో క్రేజ్ సంపాదించుకోవ‌చ్చు. గ‌ణేష్ త‌దుప‌రి ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే ప్ర‌శ్న‌కు ఈ సినిమా ఓ స‌మాధానం కావొచ్చు.

తేజ ద‌ర్శక‌త్వం వ‌హించిన ‘అహింస’ కూడా టాక్ ఆఫ్ ది టౌనే. ఎందుకంటే ఈ సినిమాలో ద‌గ్గుబాటి అభిరామ్ హీరో. త‌న‌కు ఇదే తొలి సినిమా. ఈ సినిమా హిట్ట‌యినా, ఫ్లాప్ అయినా తేజ‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీ ఉండ‌దు. కానీ… ద‌గ్గుబాటి అభిరామ్ కెరీర్ మొత్తం ఈ సినిమాతో ముడి ప‌డి ఉంది. కెమెరా ముందుకు తీసుకురావ‌డానికి ముందు అభిరామ్ చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సివ‌చ్చింద‌ట‌. త‌న న‌ట‌న‌కు సెట్స్ లో కూడా న‌గిషీలు దిద్దాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే అభి ఎలా న‌టిస్తాడు? అనే ఆసక్తి రేగింది. ఈ సినిమా అటూ ఇటూగా ఆడినా, న‌టుడిగా అభిరామ్ మార్కులు తెచ్చుకొంటే చాలు. చేతిలో ఎలాగూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఉంది కాబ‌ట్టి… మ‌రో సినిమా చేసుకోవ‌చ్చు. నెగిటీవ్ రిపోర్ట్ వ‌స్తే మాత్రం అభితో మ‌రో సినిమా చేయక‌పోవ‌చ్చు. అందుకే ఈ సినిమాతో క‌నీసం పాస్ మార్కులైనా వ‌స్తాయా? రావా? అనే కోణంలో ఈ సినిమాని చూస్తున్నారంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close