ప్రాజెక్ట్ కె: ప్ర‌శ్న‌లు ఇంకెన్నో!

ప్రాజెక్ట్ కె ఫ‌స్ట్ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఆ టింజ్‌, క‌ల‌ర్‌, ఆ సెట‌ప్ అంతా హాలీవుడ్ స్థాయిలో క‌నిపిస్తున్నాయి.నాగ్ అశ్విన్ బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లు కొట్టే స‌బ్జెక్ట్ ఏదో త‌యారు చేస్తున్నాడ‌ని ముందు నుంచీ అంద‌రి న‌మ్మ‌కం. దాన్ని ప‌దింత‌లు పెంచేలా గ్లింప్స్ క‌ట్ చేశారు. అయితే ఈ సినిమాపై కొన్ని సందేహాల‌కు స‌మాధానాలు ఇంకా దొర‌క‌లేదు.

ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది. నిర్మాత అశ్వనీద‌త్ ప్లాన్ కూడా అదే. ఇది భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమా. రెండు భాగాలైతే, బ‌డ్జెట్ ప‌రంగా వెసులుబాటు దొరుకుతుంది. అయితే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సింది నాగ అశ్వినే. ఈ క‌థ‌ని ప్రారంభిస్తున్న‌ప్పుడు రెండు భాగాల ఆలోచ‌న లేదు. ఇప్పుడు మాత్రం ఆ దిశ‌గా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. గ్లింప్స్‌లో దీనిపై క్లారిటీ లేదు. ఒక‌వేళ రెండు భాగాలైతే.. దానికి సంబంధించిన హింట్ ఇచ్చేవారు.

2024 సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేస్తార‌ని చెప్పుకొన్నారు. అయితే… ఈ సినిమా ఆల‌స్యం అవ్వొచ్చ‌ని, 2024 వేస‌వికి షిఫ్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2024 లో విడుద‌ల అని గ్లింప్స్‌లో చెప్పారు కానీ, డేట్ పై క్లారిటీ ఇవ్వ‌లేదు. అది సంక్రాంతి కావొచ్చు. వేస‌వి కావొచ్చు. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తే.. తొలి భాగం సంక్రాంతికి వచ్చేస్తుంది. ఒకే సినిమాగా చూపించాల‌నుకొంటే మాత్రం… వేస‌వికే విడుద‌ల‌. దీనిపై ఓ క్లారిటీ రావాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close