బూమ్ బూమ్ బీర్ల‌పై న‌టుడి సెటైర్‌

ఏపీలోని మ‌ద్యం బ్రాండ్ల‌పై వ‌చ్చిన‌న్ని జోకులు, మీమ్స్‌, పేర‌డీలూ.. మ‌రే విష‌యంలోనూ రాలేదంటే న‌మ్మండి. న‌చ్చిన పేరుతో బ్రాండులు దింపేసి, ఏపీ ప్ర‌జ‌ల‌తో ఆడుకొంటున్నారు. తాజాగా న‌టుడు శ్రీ‌కాంత్ అయ్య‌ర్ సైతం ఏపీ బ్రాండ్ల‌పై సెటైర్లు వేశాడు. బూమ్ బూమ్ బీరు తాగుతున్న వీడియోని పోస్ట్ చేసి.. `బెజ‌వాడ వ‌చ్చాను.. బీరు తాగాల‌నిపించింది. ఈ బ్రాండు గురించి మా ఇంట్లోవాళ్ల‌కు,స్నేహితుల‌కు చెప్ప‌లేదు. మీకు చెబుతున్నా. తాగాక ఏమ‌వుతుందో చెప్ప‌లేను. నన్ను మ‌ర్చిపోకండి. నా పేరు శ్రీ‌కాంత్ అయ్య‌ర్‌` అంటూ సెటైరిక‌ల్ గా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఏపీ మ‌ద్యం బ్రాండ్ల‌పై చాలామంది చాలార‌కాలుగా సెటైర్లు వేశారు. కానీ ఓ న‌టుడు ఇలా వీడియో పోస్ట్ చేయ‌డం మాత్రం ఇదే ప్ర‌ధ‌మం. `మీకు బూమ్ బూమ్ బీర్లే దొరికాయా..` అంటూ.. నెటిజ‌న్లు ఈ న‌టుడికి సానుభూతి తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ వెళ్లాక మంచి బ్రాండు తాగండి.. అంటూ సల‌హాలు ఇస్తున్నారు. ఏపీలో మ‌ద్యం మ‌హిమ‌లు అలా ఉన్నాయ్ మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని...2026 తర్వాత...

రాజమండ్రి లోక్‌సభ రివ్యూ : పురందేశ్వరి గెలుపు పక్కా !

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్ సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన...

ఎక్స్‌క్లూజీవ్: విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డ‌బుల్ ట్రీట్’

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈనెల 9... విజ‌య్ పుట్టిన రోజున అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇదో పిరియాడిక్...

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close