న‌క్కిన త్రినాథ‌రావు… మ‌రో క్రేజీ ప్రాజెక్ట్!

‘ధ‌మాకా’తో సూప‌ర్ హిట్టు కొట్టాడు నక్కిన త్రినాథ‌రావు. ఆ సినిమాతో పెద్ద‌ నిర్మాత‌లు, స్టార్‌ హీరోల దృష్టి న‌క్కినపై ప‌డింది. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకొన్నాడు. ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాత‌. ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం’, ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ చిత్రాల‌తో నిర్మాత‌గా త‌న అభిరుచి చాటుకొన్నారు రాజేష్‌. ఇప్పుడు న‌రేష్‌తో ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ తీస్తున్నారు. ‘ఊరు పేరు భైర‌వ కోన‌’ ఫిబ్ర‌వ‌రి 9న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు న‌క్కిన త్రినాథ‌రావుకి ఆయ‌న అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ఓ క‌థ సిద్ధం చేశారు. ఇటీవ‌లే స్టోరీ సిట్టింగ్స్ జ‌రిగాయి. స్క్రిప్టు దాదాపు ‘లాక్‌’ చేసేశారు.

ప్ర‌స్తుతం హీరో కోసం అన్వేష‌ణ‌లో ఉంది టీమ్. హీరోలుగా నాగ‌శౌర్య‌, శ్రీ‌విష్ణు పేర్లు వినిపించాయి. కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని తెలుస్తోంది. ఓ యూత్ హీరోతో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డం దాదాపుగా ఖాయం అయ్యింది. అంతా సెట్ అయితే ఈ సంక్రాంతి త‌ర‌వాత ప్రాజెక్ట్ వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. న‌క్కిన త్రినాథ‌రావు – ప్ర‌స‌న్న‌కుమార్ కాంబో అన‌గానే హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనర్లే గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా అదే జోన‌ర్‌లో ఉండ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close