సురేంద‌ర్ రెడ్డి – విక్ర‌మ్‌.. ఆల్ సెట్‌!

‘ఏజెంట్’ సినిమాతో ఓ డిజాస్ట‌ర్‌ని మూట‌గ‌ట్టుకొన్నాడు సురేంద‌ర్ రెడ్డి. అయితే… డీలా ప‌డిపోలేదు. వెంట‌నే కొత్త ప్రాజెక్ట్ పై ఫోక‌స్ పెట్టాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ – సూరి కాంబో ఇంకా ఆన్ లోనే ఉంది. ప‌వ‌న్ రాజ‌కీయాలతో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఈ కాంబోకి బ్రేకులు ప‌డ్డాయి. ఈలోగా మ‌రో సినిమా చేయ‌డానికి సూరికి ఛాన్స్ దొరికింది. అందుకే ఈసారి విక్ర‌మ్ కి ఓ క‌థ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవ‌ల విక్ర‌మ్ కి ఫైన‌ల్ నేరేష‌న్ ఇచ్చాడ‌ట సురేంద‌ర్ రెడ్డి. సూరి చెప్పిన క‌థ‌తో విక్ర‌మ్ ఇంప్రెస్ అయ్యాడ‌ని, ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. స్క్రిప్టు ప‌నులు కూడా ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఓ మంచి డేట్ చూసుకొని, ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే మిగిలివుంది. ఈ సినిమాలో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. క‌థ ప‌రంగా.. మ‌రికొంత మంది క్రేజీ న‌టీన‌టులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారు. వాళ్ల వివ‌రాల్ని సైతం చిత్ర‌బృందం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించ‌నుంది. విక్ర‌మ్ సినిమా అన‌గానే గెట‌ప్పులు గుర్తొస్తాయి. త‌న కెరీర్‌లో విక్ర‌మ్ వేయ‌ని గెటప్ లేదు. కాక‌పోతే ఈ సినిమాలో మాత్రం గెట‌ప్పుల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని సూరి నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. మ‌రి విక్ర‌మ్ ని ఆయ‌న ఏ రేంజ్‌లో చూపిస్తాడో..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close