టిల్లు క్యూబ్‌.. ఈసారి ఇంకాస్త పెద్ద స్టార్!

డీజే టిల్లు రిలీజ్‌కు ముందు ఆ సినిమాపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ అనూహ్య‌మైన విజ‌యాన్ని అందుకొంది. దానికి రెట్టింపు లాభాలు ‘టిల్లు స్క్వేర్‌’తో రాబ‌ట్టారు. ఇప్పుడు ‘టిల్లు క్యూబ్’ కూడా రాబోతోంది. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ అందుకు త‌గిన క‌థ‌ని రెడీ చేసుకోవంలో బిజీగా ఉన్నాడు. సిద్దు ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ‘జాక్‌’ అనే పేరు పెట్టారు. ఇది పూర్త‌యిన త‌ర‌వాతే ‘టిల్లు క్యూబ్‌’ ప‌ట్టాలెక్కుతుంది.

‘టిల్లు’లో నేహా శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. అప్ప‌టికి ఆమెకు ఎలాంటి క్రేజ్ లేదు. ‘టిల్లు’ రిలీజ్ అయ్యాక త‌ను కూడా పాపుల‌ర్ అయిపోయింది. ‘టిల్లు స్క్వేర్‌’లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌చ్చి చేరింది. క్యూబ్ లో ఓ స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం. త‌మ‌న్నా, స‌మంత‌.. ఇలా కొంత‌మంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. టిల్లు స్క్వేర్‌లో అనుప‌మ‌తో పాటుగా నేహా ఎలా క‌నిపించిందో, టిల్లు క్యూబ్‌లో ఆ స్టార్ హీరోయిన్‌తో పాటుగా నేహా, అనుప‌మ ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నారు. బ‌డ్జెట్ విష‌యంలోనూ టిల్లు క్యూబ్ వెసులుబాటు దొరికింది. ఈసారి టిల్లు గాడి హంగామా.. ఫారెన్‌లో ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close