‘కుష్’ డ్రగ్స్ నుంచి ఏపీ పాఠం నేర్చుకోవాలా..?

ఆఫ్రికా ఖండంలోని సియెర్రా లియోన్ దేశంలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇందుకు కారణం.. డ్రగ్స్ మహమ్మారి. ఊహించని స్థాయిలో అక్కడి యువత డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో ఏం చేయాలో తెలియక ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు.పరిస్థితి చేయి దాటడంతో ప్రభుత్వం చివరి ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో డ్రగ్స్ కు సంబంధించి విస్తుపోయే నిజాలు వెల్లడి అవుతున్నాయి.

సియెర్రా లియోన్ లో డ్రగ్స్ కు బానిసలై ఎంతోమంది రోడ్లపై ఎక్కడిక్కడ పడిపోతున్నారు. అక్కడి యువతను మత్తుకు బానిస చేసిన ఈ డ్రగ్.. కుష్. ఎంజాయ్ కోసం దీనిని తీసుకున్న యువత మత్తులోకి జారుకొని ఏం చేస్తున్నారో అర్థం కాకుండా రోడ్లపైనే పడిపోతున్నారు. వారిని గుర్తించి కుటుంబాలకు అప్పగించడం అక్కడి ప్రభుత్వానికి సవాల్ గా మారింది.దీంతో కుష్ ని నియత్రించాలంటే అత్యవసర పరిస్థితిని విధించడమే మార్గమని భావించింది. కాని, ఈ డ్రగ్ ఆరేళ్ళ క్రితమే దేశంలోకి ప్రవేశించింది. అమ్మకాలు జోరండుకోవడంతో ప్రస్తుతం దేశం ప్రమాదకర స్థితికి చేరుకుంది.

తక్కువ ధరకు లభించడంతో కుష్ ని యువత ఎక్కువ మోతాదులో తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో డ్రగ్స్ మాఫియా పెద్ద మొత్తంలో సంపాదించినట్లు తెలుస్తోంది. సాధారణంగా డ్రగ్స్ వలన అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అందులో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించే అవకాశం లేదు. లంచాలకు మరిగిన అక్కడి ప్రభుత్వం పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కుష్ తయారీలో మనుషుల ఎముకల పొడిని కూడా కలుపుతున్నారట.

దీంతో డ్రగ్స్ మాఫియా. .సమాధుల వద్ద భారీగా తవ్వకాలు ప్రారంభించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆస్థిపంజరాలను సేకరించి వాటి పొడిని కుష్ తయారీలో వినియోగిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం సమాధుల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది.దీంతో ఈ డ్రగ్ తీసుకున్న యువత తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రగ్స్ ను మొదట్లో నియత్రించకపోతే పరిస్థితి ఎలా మారుతుంది అనే దానికి సియెర్రా లియోన్ ఓ ఉదాహరణ.

ఇటీవల ఏపీలో 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. సీబీఐ ఈ కేసును పర్యవేక్షిస్తున్నా.. కేసు సంగతి అతీగతీ లేకుండా పోయింది. ప్రస్తుతం ‘కుష్ ‘వ్యవహారం ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా డ్రగ్స్ విషయంలో రాజకీయాలు మానేసి.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close