సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌…. ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై బాలీవుడ్ ఎప్పుడూ ఓ క‌న్నేస్తుంటుంది. వాళ్ల చూపు ఇప్పుడు సంయుక్త‌పై ప‌డింది. ఈ ముద్దుగుమ్మ‌కు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇప్పుడు అందుకోస‌మే… సంయుక్త ముంబై ఫ్లైట్ ఎక్కింది. ఈరోజు సంయుక్త లుక్ టెస్ట్ లో పాల్గొన‌బోతోంది. అన్నీ ఓకే అయితే, ఈ వారంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ రావ‌డం ఖాయం.

టాలీవుడ్ లో యంగ్ హీరోల‌కు సంయుక్త ఓ మంచి ఆప్ష‌న్‌. ప‌ద్ధ‌తైన పాత్ర‌లు చేస్తూనే, అప్పుడ‌ప్పుడూ గ్లామ‌ర్ ఒలికిస్తుంటుంది. పైగా పారితోషికం విష‌యంలోనూ పేచీ పెట్ట‌ద‌ని టాక్‌. ప్ర‌మోష‌న్ల‌కు కూడా అందుబాటులో ఉంటుంది. అందుకే తెలుగులో ఇన్ని అవ‌కాశాల్ని చేజిక్కించుకొంటోంది. బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చేస్తే.. సంయుక్త క్రేజ్ మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close