తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ప్రచారం కొనసాగిస్తున్నారు. నిజానికి శిరోముండనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం. ఈ కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష పడాలని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలు చేశాయి. ఇప్పుడు శిక్ష పడింది.

తోట త్రిమూర్తులకు శిక్ష పడిన తర్వతా దళిత సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఆయన వెంటనే బెయిల్ తెచ్చుకుని జైలుకెళ్లే ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కానీ శిక్ష మాత్రం ఖరారయింది. హైకోర్టు స్టే ఇస్తే తప్ప.. శిక్ష అనుభవించాల్సిందే. తోట త్రిమూర్తులతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత మాత్రం దళితల డిమాండ్లను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.

దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో ఎమ్మెల్సీ అనంతబాబును ఎలా ప్రోత్సహిస్తున్నారో తోట త్రిమూర్తులను కూడా అలాగే ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతబాబు విషయంలో దళితులు , గిరిజనులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏం చేసినా దళితులు తమ ఓటు బ్యాంక్ గానే ఉంటారని ఇతర పార్టీలకు పోరన్న పెత్తందారి పోకడల కారణంగానే ఇలా దళితలపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ వెనకేసుకు వస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close