ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావ‌మ్మా రాశీఖ‌న్నా!

ఒక‌ప్పుడు యంగ్ హీరోల ప‌క్క‌న ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది రాశీఖ‌న్నా. అందుకే చ‌క చ‌క సినిమాలు చేసేసింది. ద‌క్షిణాదితో పాటుగా హిందీలోనూ మెరిసింది. అయితే కొన్నాళ్లుగా తెలుగు సినిమా రాశీఖ‌న్నాని ప‌ట్టించుకోవ‌డం మానేసింది. ముందు పూజా హెగ్డే, ఆ త‌ర‌వాత శ్రీ‌లీల‌, కృతిశెట్టి లాంటి హీరోయిన్ల తాకిడికి డ‌ల్ అయిపోయింది. అలాగ‌ని ఖాళీగా ఏం లేదు. బాలీవుడ్ ప్రాజెక్టులో, వెబ్ సిరీస్ లో చేసుకొంటోంది. తెలుగువాళ్లు మాత్రం సీత క‌న్నేశారు. ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ త‌ర‌వాత‌ రాశీఖ‌న్నా తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు. ‘థ్యాంక్యూ’లో క‌నిపించింది కానీ అందులో ఆమెను హీరోయిన్ అన‌లేం. ఆ సినిమా కూడా ఫ్లాపే. న‌వ‌త‌రం హీరోయిన్ల జోరు చూశాక‌.. రాశీఖ‌న్నా లాంటి వాళ్ల‌కు మ‌ళ్లీ పిలుపు రావ‌డం క‌ష్ట‌మే అనిపించింది. రాశీఖ‌న్నాని ఇక మ‌ర్చిపోవొచ్చు అనుకొంటున్న త‌రుణంలో.. మ‌ళ్లీ ఓ ఛాన్స్ వ‌చ్చింది. నితిన్ సినిమా ‘రాబిన్ వుడ్‌’ రూపంలో.

నితిన్ క‌థానాయ‌కుడిగా వెంకీ కుడుముల దర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం `రాబిన్‌వుడ్‌`. ఇందులో ముందు ర‌ష్మిక‌ను హీరోయిన్ అనుకొన్నారు. త‌న స్థానంలో శ్రీ‌లీల‌ని తీసుకొన్నారు. ఇప్పుడు శ్రీ‌లీల ప్లేస్‌లోకి రాశీఖ‌న్నా వ‌చ్చింద‌ని తెలుస్తోంది. శ్రీ‌లీల‌, నితిన్ కాంబోలో వ‌చ్చిన ఎక్స్ట్రా సినిమా ఫ్లాప్ అయ్యింది. పైగా శ్రీ‌లీల ఫోక‌స్ అంతా ఇప్పుడు చ‌దువుల‌పై ఉంది. అందుకే ఆమె స్థానంలో రాశీని ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. చిత్ర‌బృందం మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఈ చిత్రాన్ని ఈయేడాది డిసెంబ‌రు 20న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కొత్త అప్‌డేట్‌లోనూ హీరోయిన్ పేరు ప్ర‌స్తావించ‌లేదు. బ‌హుశా.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close