బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు కానీ..అందర్నీ ఒకే సారి చేర్చుకుని షాకివ్వాలని అనుకోవడం లేదు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తి చేసి.. కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని అనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడొక ఎమ్మెల్యే.. ఇక్కడొక ఎమ్మెల్యే తప్ప.. అందరూ కలసి కట్టుగా వచ్చి చేరే అవకాశాలు కనిపించడం లేదు.

ఇప్పటికే నలుగురు మాత్రమే కాంగ్రెస్ లో చేరినట్లు. తెల్లం వెంకట్రావు , దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్..ఇవాళో రేపో చేరుతారు. నిజానికి ఇతర ఎమ్మెల్యేలు అంతా కలసి కట్టుగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలు చేశారు. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు చేసిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నట్లుగా ప్రచారం చేశారు. కానీ వారు భేటీలకు హాజరై.. తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారో లేదో స్పష్టత లేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంక్ ను కూడా నిలుపుకోవడానికి కష్టపడితే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది. అయితే వారి చాయిస్ కాంగ్రెస్ నా బీజేపీనా అన్నది కూడా ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే ఉండవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

ఖరీదైన స్థలం కొని ఘోరంగా మోసపోయిన జూ.ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే...

ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈసీ సంచలన నిర్ణయం

ఏపీలో పరిస్థితులు నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. పల్నాడు, అనంతపురం జిల్లాలో పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close